ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బాగా చక్కర్లు కొడుతున్న గాసిప్ ఏది అంటే బిసిసిఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ బయోపిక్ గురించి. సౌరబ్ గంగూలీ బయోపిక్ మరికొన్ని రోజుల్లో పట్టాలేక్కపోతుందని.. ఇక గంగూలీ పాత్రలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించబోతున్నాడని వార్తలు తెగ హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే గంగులి బయోపిక్ లో నటించేందుకు రణబీర్ కపూర్ అతడిని కలిసి కొన్ని విషయాలను కూడా తెలుసుకుంటున్నారని అతడిలా బాడీ లాంగ్వేజ్ ని మార్చుకుంటున్నారని వార్తలు వచ్చాయి.
ఇక ఇటీవల ఇదే విషయంపై రణబీర్ కపూర్ క్లారిటీ ఇచ్చాడు. తను ఇప్పటివరకు ఎవరూ కూడా సౌరబ్ గంగూలీ పాత్ర చేయమని అడగలేదు అంటూ స్పష్టం చేశాడు రణబీర్ కపూర్. అయితే తాను ఒక బయోపిక్ లో నటిస్తున్నానని.. అది సౌరబ్ గంగూలీ బయోపిక్ కాదని. దివంగత సింగర్ అయినా కిషోర్ కుమార్ జీవిత కథ ఆధారంగా తరికేకుతున్న బయోపిక్‌లో నటిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ తుది దశకు చేరుకుందని.. త్వరలోనే సెట్స్ పైకు వెళ్ళబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక రణబీర్ కపూర్ చెప్పిన మాటలు చూస్తే సౌరబ్ గంగూలీ బయోపిక్ లేనట్లేనా అని అభిమానులు నిరాశపడుతున్నారు.