టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో సుకుమార్ ఒకరు. ఈయన ఆర్య మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే అదిరిపోయి రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని అద్భుతమైన గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అనేక మూవీ లకు దర్శకత్వం వహించిన సుకుమార్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

 సుకుమార్ ఆఖరుగా పుష్ప ది రైస్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో అల్లు అర్జున్ హీరో గా నటించగా ... రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించారు. ఇది ఇలా ఉంటే సుకుమార్ ప్రస్తుతం పుష్ప ది రూల్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే పుష్ప ది రైస్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పుష్ప ది రూల్ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అలాగే ఈ మూవీ నుండి ఒక వీడియోను ఈ చిత్ర బృందం విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

 అలాగే ఈ మూవీ నుండి అల్లు అర్జున్ కు సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా దానికి కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే సుకుమార్మూవీ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సుకుమార్ ... ప్రభాస్ కు ఒక అదిరిపోయే స్టోరీని వినిపించినట్లు ... ఆ స్టోరీ బాగా నచ్చిన ప్రభాస్ కూడా వెంటనే సుకుమార్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: