డబ్బుకన్నా మించిన సంపదలు అనేకం ఉన్నాయని డబ్బుతో కొనలేని సంపదలు చాలచాల ఉన్నాయని చాలామంది చెపుతూ ఉంటారు. డబ్బంటే కేవలం కాగితం ముక్కలు మాత్రమేనని డబ్బుతో రాని విషయాలు అనేకం ఉన్నాయని అనేకమంది ఆధ్యాత్మిక వేత్తలు చెపుతూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి ఉద్యోగం కోసం వెతుక్కుంటూ రోడ్ల వెంట పడుతూ ఎంత తిరిగినా అతడికి అన్ని అర్హతలు ఉండి ఉద్యోగమే దొరకకపోతే అతడిలో మానసికంగా నిరాశ ఎదురై ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది.


ఈ భావం నుండి బయటపడాలి అంటే ఏ వ్యక్తికైనా కావలసిన వస్తువు ‘డబ్బు’ అన్న వాస్తవాన్ని ఎవరైనా గుర్తించి తీరాలి. వాస్తవానికి డబ్బు మనిషికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆత్మగౌరవంతో ఒక మనిషి జీవించాలి అనుకుంటే అది కేవలం డబ్బు మాత్రం వలెనే సమకూరుతుంది. అంతేకాదు ఒక మనిషిలో అశాంతికి అంతర్యుద్ధానికి గల కారణం డబ్బు లేకపోవడమే అన్న వాస్తవాన్ని మానసిక వైద్యులు కూడ గుర్తిస్తున్నారు.


అయితే ఈ డబ్బు ఎవరికి ఎంత ఉండాలి అన్న విషయమై చాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ డబ్బు సంపాదనకు అడ్డుపడే విషయాలను పరిశీలిస్తే కొన్ని లోపాలు వల్ల మనకు మనమే పేదరికంలోకి వెళ్ళి పోతున్నాము అని అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతి విషయంలో సహజంగా వచ్చే సందేహాలు సందిగ్ధం ఒక వ్యక్తిని డబ్బుకు దూరం చేస్తుంది. అదేవిధంగా స్వీయ చైతన్యం కోల్పోవడం ఆందోళన కూడ డబ్బు సంపాదనకు అడ్డుగా నిలుస్తాయి. ఇక ఈ కారణాలలో అతి ముఖ్యంగా చెప్పుకోవలసింది అతి జాగ్రత్త.


ఈ అతిజాగ్రత్త వల్ల ఒక వ్యక్తి తన గడపలోకి వచ్చే అవకాశాలను కూడ పోగొట్టుకుంటూ ఉంటాడు. ఇక చివరిగా ప్రతి విషయానికి ఎదో ఒక సాకు చెపుతూ వాయిదా వేసే గుణం ఉన్న వ్యక్తి తనకు తానుగా ఎవరి ప్రమేయం లేకుండా పేదరికంలోకి వెళ్ళిపోతాడు. ఇలాంటి పరిస్థితులలో డబ్బు సంపాదించే అవకాశాలను పైన పేర్కున్న నెగిటివ్ కారణాలు వల్ల వ్యక్తి కోల్పోతాడు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా డబ్బు ప్రతి వ్యక్తి స్థాయి గురించి మాట్లాడుతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: