డబ్బు సంపాదించడంలో విజయానికి రాచ బాట. డబ్బును సంపాదించాలి అంటే ఎంత సమర్థత కావాలో ఆ సంపాదనను నిలుపు కోవడానికి మరింత సమర్థత ఉండాలి. ఒక వ్యాపారాన్ని సాంప్రదాయ పద్ధతిలో అందరికీ తెలిసిన విధంగా నిర్వహించే వారు ఎట్టి పరిస్థితులలోను ధనవంతులు కాలేరు.


ఒక వ్యాపారాన్ని విభిన్న పద్ధతులలో అభివృద్ధి చేయడానికి అపార మేధస్సు కావాలి. అయితే ఈ మేధస్సు పుస్తకాలలో చదివితే వచ్చేది కాదు అనుభవంతో ఈ మేధస్సును మనం పెంపోదించుకోవచ్చు. అయితే ప్రతి వ్యాపారానికి సంబంధించిన నిర్వాహణలో అను నిత్యం ఒక సరికొత్త ప్రయోగం పరిశోధన చేస్తూ ఉండాలి. పరిశోధన అన్నది కేవలం శాస్త్ర వేత్తల ప్రయోగానికి మాత్రమే సంబంధించింది కాదు.


వ్యాపార నిర్వహణలో ఒక వ్యక్తి తనకు లభించిన సమాచారాన్ని అంతా క్రోడీకరించి ఆపై వర్గీకరించి తన వ్యాపార నిర్వాహణలో ఈ సమాచారాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఆ వ్యాపారం విజయవంతం అయి ఆ వ్యాపారం చేసే వ్యక్తి ధనవంతుడు కాగలుగుతాడు. అయితే చాలామంది పేదరికం నిరక్షరాస్యత అజ్ఞానం వల్ల తాము తమతమ వ్యాపారాలలో రాణించలేకపోయాము అని భావిస్తూ ఉంటారు. అయితే ఈ లక్షణాలు వల్ల వైఫల్యాలు రావు. కేవలం చేసే వ్యాపారంలో పరిశోధనా లోపం వల్ల మాత్రమే ఒక వ్యక్తికి వ్యాపారంలో నష్టాలు వస్తాయి.


అందుకే మనిషి మెదడును ఎలట్రానిక్ బ్యాటరీతో పోలుస్తారు. బ్యాటరీ లాగే మన మైండ్ ను కూడా నిరంతరం చార్జ్ ని చేసుకుంటూ ఉండాలి. అలా ఆలోచనలతో చార్జ్ ని చేసుకోవడమే వ్యాపార పరిశోధన. నిరంతర కార్యాచరణకు సంబంధించిన ప్రణాళిక కేవలం ఆలోచనలు ఉన్నవారికి మాత్రమే వస్తూ ఉంటాయి. అందువల్ల మన ఆలోచనలతో మన ప్రయోగాలు కొనసాగిస్తూ ఆ ప్రయోగాలను చాల వ్యూహాత్మకంగా వ్యాపారంలో చేసినప్పుడు మాత్రమే విజయం లభిస్తుంది. అందుకే వివేకంతో కూడిన పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు మాత్రమే సంపదను పొందగలరు..  

మరింత సమాచారం తెలుసుకోండి: