200 రూపాయల ఆదాయంతో లక్షాధికారులు అవ్వచ్చు అని చెబితే ఎలా సాధ్యమవుతుంది..? రూ.50, రూ.100 ఆదాతో డబ్బున్న వారి గా ఎలా మారడం అని అనుకుంటే మాత్రం పొరబాటే..! ముఖ్యంగా రూపాయి తో మనం ఆదా మొదలు పెడితే కచ్చితంగా డబ్బులను ఎక్కువ మొత్తంలో ఆదా చేసే స్థాయికి చేరుకుంటారు.. ఇప్పుడు కూడా తక్కువ మొత్తంతో ఆదా చేస్తూ వెళ్లడం వల్ల , నిర్ణీత సమయానికి లక్షాధికారులు అవుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు..


ముఖ్యంగా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం వల్ల, తరువాత మంచి ఫండ్ ను వెనక వేసుకోవచ్చు. ఇకపోతే చిన్న పొదుపు పథకాలకు ఖచ్చితంగా సూటయ్యే పథకం ఏదైనా ఉంది అంటే అది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా మాత్రమే అని చెప్పవచ్చు ఎందుకంటే ఇందులో ప్రతి రోజు రెండు వందల రూపాయలను ఆదా చేస్తూ వెళ్లడం వల్ల కేవలం 20 సంవత్సరాల లోని , చేతికి 14 లక్షల రూపాయలు అవుతాయి. అంతేకాదు ఈ పథకం మీద 7.1 శాతం  వడ్డీ రావడంతో పాటు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఈ పథకం బ్యాంకు లలో అలాగే మీకు దగ్గరలో ఉన్న పోస్టాఫీసులలో కూడా ఉంటుంది కాబట్టి 15 సంవత్సరాల పాటు కొనసాగే ఈ పథకంలో మరో ఐదు సంవత్సరాల పాటు కొనసాగించవచ్చు.


మీరు మీ ఖాతా ను కేవలం 500 రూపాయలతో తెరవాల్సిన అవసరం ఉంటుంది. కనిష్టంగా ఐదువందల తో మొదలుపెట్టి గరిష్టంగా రూ.150 వేల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మీకు  7.1 శాతం ఏప్రిల్ - జూన్ నెలలో వడ్డీ కూడా అందుతుంది. ఉదాహరణకు మీరు 200 రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టాలని అనుకుంటే, నెలకు 6000 రూపాయలు అవుతుంది. మీరు సంవత్సరానికి 72 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి వుంటుంది.


ఇక 15 సంవత్సరాలు ఇలా మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే, మొత్తం పెట్టుబడి 10 లక్షల 80 వేల రూపాయలు అవుతుంది. ఇక 7.15 శాతం వడ్డీతో కలుపుకంటే మొత్తం 17.55 లక్షల రూపాయలు మీ సొంతమవుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: