నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలను సెట్స్ మీద ఉంచిన ఉన్న సంగతి తెలిసిందే.. ఒకటి రాధే శ్యామ్ సినిమా కాగా ఇంకోటి మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమా.. మరొకటి బాలీవుడ్ ఫిలిం గా తెరకెక్కుతున్న ఆదిపురుష్.. ఇంకోటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సలార్.. వీటిలో రాధే శ్యామ్ సినిమా ముందుగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.. గోపీచంద్ తో జిల్ సినిమా ను తెరకెక్కించిన రాధాకృష్ణ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నాడు.. పూజ హెగ్డే కథానాయిక గా నటిస్తుంది..