వెండితెరపైనే తన స్టెప్పులతో అదరగొడుతున్న శేఖర్ మాస్టర్ బుల్లితెరపైన కూడా జడ్జ్ గా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కొరియోగ్రాఫర్ లలో ఆయనే టాప్ డాన్స్ మాస్టర్.. రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేసిన శేఖర్ మాస్టర్ ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్ గా ఎదిగారు.. ప్రస్తుతం స్టార్ హీరోలకు ఈయనే ఎక్కువ డాన్స్ మాస్టర్ గా ఉంటున్నారు. చిరంజీవి దగ్గరినుంచి చిన్న హీరో దాకా శేఖర్ మాస్టర్ అందరికి కావాల్సిందే.. కనీసం సినిమాలో ఒక్క పాటకైనా శేఖర్ స్టెప్పు ఉండాల్సిందే..