‘షాడో’ సినిమాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. వెంకటేష్ హీరోగా మెహార్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ‘షాడో’ సినిమాపై మొదటి నుంచి పెద్దగా అంచనాలు లేవు. తాజాగా ఆ చిత్ర కథా-మాటల రచయిత కోన వెంకట్ చెబుతున్న మాటలు ఆ సినిమాపై ఎలాంటి ఆసక్తిని కలిగించడం లేదు. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ షాడో సినిమాతో పాటు, ఎన్టీఆర్ నటిస్తున్న ‘బాద్ షా’ సినిమాకు కూడా పని చేశారు. ఆయన ఎక్కడకు వెళ్లినా ‘బాద్ షా’ గురించి గొప్పగా చెబుతున్నాడు. బాద్ షా సినిమా సమ్మర్ లో అతి పెద్ద హిట్ గా నిలుస్తుందని చెప్పుతున్నాడు. దాని వెనుకే రిలీజ్ అవుతున్న ‘షాడో’ గురించి చాలా ముక్తసరిగా మట్లాడుతున్నాడు. తాజాగా గుంటూరు జిల్లాలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి నాటక పోటీల వేడుకకు హాజరయ్యాడు కోన వెంకట్. అక్కడ ఆయన మాట్లాడుతూ సమ్మర్ లో బాద్ షా సినిమా సునామీ సృష్టిస్తుందంటూ గొప్పలు చెప్పాడు. ఎన్టీఆర్ ఆదరగొట్టాడని కితాబు ఇచ్చాడు. ఇక ‘షాడో’ గురించి మాట్లాడుతూ వెంకటేష్ తో కలసి ‘షాడో’ సినిమాకు పని చేశానని సింపుల్ గా తెల్చేశాడు. కాగా, ఏప్రిల్ 5న ‘బాద్ షా’, ఏప్రిల్ 11న ‘షాడో’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: