పవన్ కళ్యాణ్ తో ‘అత్తారింటికి దారేది’ సినిమా తీసిన నిర్మాత బి.వి.ఎస్. ఎన్. ప్రసాద్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది అంటూ టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన నిర్మించిన సినిమాలు ఆయనకు నష్టాలే మిగిల్చాయి. గత సంవత్సరం విడుదలైన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా ఘోరంగా పరాజయం పాలైంది. ఈ మధ్యనే విడుదలైన గోపీచంద్ ‘సాహసం’ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా వసూళ్ళ విషయంలో బాగా వెనక పడింది. ఈ నష్టాలు అన్నింటికి పవన్ ‘అత్తారింటికి దారేది’ దారి చూపుతుంది అనుకుంటే ఆ సినిమా విడుదలకు దారి ఎప్పుడో తెలియని పరిస్థితి ఏర్పడటంతో నెలకు రెండు కోట్ల రూపాయల నష్టం వడ్డీ రూపంలో పోతోందని అనే వార్తలు వినిపిస్తున్నాయి.
50కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మార్కెట్ బాగా జరగడంతో మొదట్లో ఈ సినిమా నిర్మాత ప్రసాద్ కష్టాల నుంచి గట్టేక్కేసాడు అనుకున్నారు. కానీ అనుకోని సమైక్య ఉద్యమం సెగ ఈ సినిమాకు తగలడంతో ఈ సినిమా విడుదల అనుకున్న సమయానికి విడుదల కాకుండా ఇంచుమించు నెల రోజులు గడిచిపోయి రెండో నెలలోకి వచ్చేసింది. మొదట్లో ఈ సినిమాకు టేబుల్ ప్రాఫిట్ వచ్చిందని అభినందించిన వారే ప్రస్తుతం ప్రసాద్ పరిస్థితి పై జాలి పడుతున్నారట. ధైర్యం చేసి ఈ సినిమాను ఈ నెల 20న కాని 27న కాని విడుదల చేయమని పవన్ నిర్మాతకు చెపుతున్నా అదే సమయానికి కేంద్ర కేబినెట్ ముందుకు తెలంగాణ బిల్లు వచ్చే పరిస్థుతులు ఉండటంతో ఈ నేపధ్యంలో ఉద్యమం ఇంకా తీవ్రం అయితే భారీ నష్టాలు వస్తాయని అటు బయ్యర్లు ఇటు నిర్మాత భయపడుతున్నారట.
ఈ వారంతం లోగా ఈ సినిమా విడుదలపై ఒక నిర్ణయం రావచ్చని అంటున్నారు. అలా కాకుండా ఈ అక్టోబర్ కూడా మిస్ అయితే నెల తిరిగే సరికి మరో రెండు కోట్ల నష్టం వస్తుందని అప్పుడు సినిమా ఎంత హిట్ అయినా ప్రయోజనం లేదని నిర్మాత గగ్గోలు పెడుతున్నాడని టాక్. ఏవిధంగా చూసినా పవన్ పవర్ స్టార్ సినిమాకు నెలకు రెండు కోట్ల నష్టం విడుదల కాకుండానే అటు నిర్మాతను ఇటు బయార్లను అగమ్యగోచరంలోకి నెట్టెస్తోంది...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి