2019 లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న నేపధ్యంలో రాబోతున్న ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రధానమైన పోటీలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ లతో పాటు పవన్ ‘జనసేన’ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎనిమిది జిల్లాలలో ఒక కీలకశక్తిగా మారబోతున్నట్లు ఆజాతీయమీడియా తన కథనంలో పేర్కుంది. 

వాస్తవానికి 2019ఎన్నికలలో టీడీపీ వైసీపీల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అందరు భావిస్తున్నా చాపక్రింద నీరులా ‘జనసేన’ తన ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 8 ముఖ్య జిల్లాలలో చూపించబోతున్న నేపధ్యంలో పవన్ ఎన్నికల తరువాత క్రియాశీలక శక్తిగా మారే ఆస్కారం ఉంది అని ఆజాతీయ మీడియా సంస్థ తన అభిప్రాయాలను వ్యక్త పరుస్తోంది. ఇలాంటి పరిస్థుతులలో రాబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తరువాత కఠిన షరతులతో జనసేనాని ఇచ్చే మద్దతుతో మాత్రమే ఆంద్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కాని తెలుగుదేశం కానీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని ఆమీడియా సంస్థ అభిప్రాయ పడుతోంది.  

దీనితో కర్ణాటకలో తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రి అయి చక్రం తిప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్ లో పవన్ ముఖ్యమంత్రి అవ్వకపోయినా కాబోయే ముఖ్యమంత్రిని నిర్ణయించే క్రియాశీలక శక్తిగా ‘జనసేన’ మారడం ఖాయం అనే అభిప్రాయాలు ఆకథనంలో వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు రానున్న ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో టీడీపీ వైసీపీలకు సరైన పూర్తి మెజార్టీ రాకపోవడంతో ‘జనసేన’ కఠిన షరతులను అంగీకరించే వ్యక్తి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యేలా ఢిల్లీ నుండి ఒక మాస్టర్ ప్లాన్ ఇప్పటికే తయారైంది అని ఆపత్రిక అభిప్రాయ పడుతోంది. 

ఇది ఇలా ఉంటే నాగబాబు అధికారికంగా ‘జనసేన’ లో చేరనప్పటికీ గత కొద్దిరోజులుగా నాగబాబు తరుచూ కోస్తా జిల్లాలలో పర్యటిస్తూ పవన్ అభిమానులను అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్ది నేతలను కలుస్తూ ‘జనసేన’ కు గట్టిగా మద్దతు ఇచ్చి ప్రచారం చేస్తే రాబోతున్న రోజులలో అధికారం మనదే అన్నస్పూర్తిని కలిగిస్తూ అనేక ఇండోర్ సమావేశాలు మీడియాకు తెలియకుండా ‘జనసేన’ ముఖ్య నాయకుల ఇళ్ళలో నాగబాబు నిర్వహిస్తున్నట్లు కూడ ఆకథనంలో పేర్కొనబడింది. దీనితో ఈకథనంలోని వాస్తవాలు ఎంతవరకు అన్నవిషయంలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ కు సంబంధించిన కీలక నేతలు కోస్తా జిల్లాలలకు సంబంధించిన వాస్తవ పరిస్థితుల పై అంచనాలు వేస్తున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: