భారతదేశంలోని ప్రతి పౌరుడు గర్వపడే విధంగా మన భారత వాయుసేన పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుని పోయి అక్కడి ఉగ్ర మూకల పై పిడుగుల వాన కురిపించినందుకు మన ఇండియాలోని సామాన్యుడు దగ్గర నుండి సెలెబ్రెటీల వరకు ఈ ఆపరేషన్ నిర్వహించిన మన వాయు సేనకు సెల్యూట్ చేసారు. మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి మహేష్ ప్రభాస్ జూనియర్ రామ్ చరణ్ లతో పాటు కోలీవుడ్ టాప్ హీరోలు రజినీకాంత కమల్ హాసన్ లు కూడ మన భారత వాయు సేనకు అభినందనలు తెలియచేసారు.
ఇక మన ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో పాటు వివిధ రాజకీయ పార్టీల అధినేతలు అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిన మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్లకు అభినందనలు తెలియచేస్తూ తమ దేశభక్తిని చాటుకుంటున్నారు. అయితే ఈ లిస్టులో పవన్ కళ్యాణ్ లేకపోవడం పవన్ అభిమానులను కూడ ఆశ్చర్య పరుస్తోంది.
పవన్ తన ఉపన్యాసాల ముగింపు సమయంలో ‘జైహింద్’ నినాదం చేయకుండా తన ఉపన్యాసం ముగించడు. అంతేకాదు మన దేశ జెండాకు చాల ఉద్వేగంతో సెల్యూట్ చేస్తూ ఉంటాడు. అలాంటి పవన్ మన ఇండియా ఖ్యాతి పెంచే సర్జికల్ స్త్రైక్స్ విషయమై నిన్న రాత్రి వరకు స్పందించక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ చర్చలు జరుగుతున్నాయి.
వాస్తవానికి ప్రస్తుతం పవన్ జనం మధ్యనే ఉన్నాడు. గత రెండు రోజులుగా కర్నూల్ జిల్లాలో అనేక రోడ్ షోలు కూడ నిర్వహించాడు. ఇలాంటి పరిస్థుతులలో ఒక రాజకీయ నాయకుడుగా మాత్రమే కాకుండా ఒక టాప్ ఫిలిం సెలెబ్రెటీగా దేశ భక్తి ఎంతో ఎక్కువ ఉన్న పవన్ దగ్గర నుండి మొట్టమొదటి అభినందనలు మన వాయు సేనకు వస్తాయని పవన్ అభిమానులు ఆశించారు. అయితే దీనికి విరుద్దంగా పవన్ ఇప్పటికీ స్పందించక పోవడంతో కర్నూల్ జిల్లాలో ఒక రైతు పవన్ ను ఓపెన్ గా ప్రశ్నిస్తూ తమ సమస్యలు తీరాలి అంటే జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి అన్న ఆ రైతు కామెంట్స్ కు పవన్ మైండ్ బ్లాంక్ అయిన నేపధ్యంలో సర్జికల్ స్ట్రిక్ విషయాలు కూడ తెలియడం లేదేమో అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..