యాంకర్ గా బుల్లితెర మీద సంచలనాలు సృష్టించిన సుమ మారుతున్న కాలానికి అనుగుణంగా తను కూడా మారాలని అనుకుంది కాబోలు అందుకే సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టేసింది. ఇక తన క్రియేటివ్ టీంతో ఎలా ఈ యూట్యూబ్ ఛానెల్ ను ప్రేక్షకుల్లో తీసుకెళ్లాలో మీటింగ్ ఏర్పాటు చేసి దాన్ని ప్రోమో రూపంలో రిలీజ్ చేశారు.


ఛానెల్ పెట్టి చాలా రోజులవుతుంది.. దానికి 30 వేల సబ్ స్క్రైబర్స్ కూడా వచ్చారంటూ తన టీంతో చెప్పిన సుమ ఓ ఐడియా కోసం టీం అందరిని ఓ చోటికి చేరుస్తుంది. అయితే వారు మాత్రం సుమ టేబుల్ మీద పెట్టిన స్నాక్స్ మీదే ఎక్కువ దృష్టి పెడతారు. ఫైనల్ గా పొలిటికల్ కాంపెయిన్ లా యూట్యూబ్ కాంపెయిన్ చేస్తే ఎలా ఉంటుందని టీం సభ్యుడు సలహా ఇచ్చాడు. దానికి ఇదేదో బాగుందని సుమ ఓకే అంటుంది.


ఇది మొదటి ప్రోమో కాన్సెప్ట్.. ఇక సెకండ్ ప్రోమోలో పొలిటికల్ లీడర్ గా సుమ వచ్చి ఫ్యాన్స్ అదే ప్రజలతో తన ఛానెల్ లో ఏమేమి ఉంటాయో చెప్పింది. మొత్తానికి సుమ కూడా తనకు బుల్లితెర మీద వచ్చే క్రేజ్ సరిపోక యూట్యూబ్ ద్వారా కూడా ఇంకాస్త వెనుకేసుకోవాలని చూస్తుంది. మరి సుమ యూట్యూబ్ ఛానెల్ కు ఇంత హంగామా ఎందుకో అర్ధం కావట్లేదు.


బుల్లితెర మీద తను ఓ స్టార్ యాకర్ గా వెలిగిపోతుంది. యాంకర్ అవ్వాలనుకున్న ప్రతిఒక్కరికి సుమనే స్పూర్తి. మరి ఇప్పుడు ఆమె కూడా యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టించాలని చూస్తుంది. మరి సుమక్క ఛానెల్ లో ఎలాంటి వీడియోలు చేస్తారో చూడాలి. తప్పకుండా సుమకు ఉన్న క్రేజ్ కు ఆమె యూట్యూబ్ లో కూడా అదరగొట్టడం ఖాయమని చెప్పొచ్చు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: