మెగా హీరో వరుణ్ తేజ్ ,ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం గద్దలకొండ గణేష్. ఇటీవల విడుదలైన ఈచిత్రం పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుని మొదటి నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన వసూళ్లను రాబట్టుకుంది. అయితే ఆ తరువాత వర్షాల ప్రభావం వల్ల కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. ఇక నిన్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 0.90కోట్ల షేర్ ను రాబట్టి 10రోజుల్లో 20కోట్ల షేర్ తో యబో యావరేజ్ అనిపించుకుంది.
ఈచిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 5కోట్లు రాబట్టాల్సి వుంది. అయితే అది అంత ఈజీ కాదనిపిస్తుంది. బుధవారం నుండి దేశ వ్యాప్తంగా సైరా హావ కొనసాగనుంది. దాంతో గద్దల కొండ గణేష్ ను ప్రేక్షకులను పట్టించుకోవడం కష్టమే.. సినిమా బాగుందని అనిపించుకున్న ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కావడానికి తంటాలు పడుతుంది. దీనికి కారణం సరైన టైం లో రిలీజ్ చేయకపోవడమే. సైరా విడుదలకానున్న మూడు వారాల ముందే రిలీజ్ చేసివుంటే ఇప్పుడు ఈపరిస్థితి వచ్చేది కాదు. మరి

ఓవర్సీస్ లో ఇప్పటికే డిజాస్టర్ అనిపించుకున్న ఈ చిత్రం ఇక్కడైనా కనీసం హిట్ అని అనిపించుకుంటుందో లేదో చూడాలి.
కోలీవుడ్ సూపర్ హిట్ గ్యాంగ్ స్టార్ డ్రామా 'జిగర్తండా' కు రీమేక్ గా తెరకెక్కిన ఈచిత్రంలో బాబీ సింహ పాత్రలో వరుణ్ తేజ్, సిద్దార్థ్ పాత్రలో తమిళ యువ హీరో అథర్వ మురళి నటించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఫై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈచిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా పూజాహెగ్డే , మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు.