ఇకపోతే దీని తరువాత
మెగాస్టార్ నటించబోయే 152వ
సినిమా పూజా కార్యక్రమలు ఇటీవల ఘనంగా జరిగాయి.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను
కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మించనున్నాయి. ఈ సినిమాకోసం
మెగాస్టార్ ఇప్పటికే చాలావరకు బరువు కూడా తగ్గారు. అయితే నేడు కొన్ని
కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ
సినిమా కథ కొంతవరకు గతంలో
మహేష్ మరియు
కొరటాల కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడుని పోలి ఉంటుందని టాక్ వినపడుతోంది. అయితే
సినిమా మాత్రం శ్రీమంతుడు తరహాలో సాగదని,
కాకపోతే శ్రీమంతుడు మాదిరి ఈ
సినిమా కూడా ఒక ఊరిలోని ప్రధాన సమస్య చుట్టూ తిరుగుతూ ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో
మెగాస్టార్ ఎంతో పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనపడనున్నట్లు టాక్ వినపడుతోంది. అలానే ఆయన క్యారెక్టర్ తో పాటు సినిమాలో
హీరోయిన్ క్యారెక్టర్ కు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాలో నటించే
హీరోయిన్, మరియు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందని, వారి వివరాలు అతి త్వరలో అధికారిక ప్రకటన రూపంలో వెలువడనున్నాయని సమాచారం....!!