రెండేళ్లు.. నాలుగు సినిమాలు.. రష్మిక గురించి చెప్పాలంటే.. ఈ రెండు ముక్కలు చాలు.. అలా తారాపథంలో దూసుకెళ్లిందీ తార. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేశ్ పక్కన అలరిస్తోంది. సినిమా సక్సస్ అయితే మరోసారి టాలీవుడ్ లో రష్మిక స్థానం టాప్ ప్లేస్ కు చేరువ కావడం ఖాయం. సినిమా సంక్రాంతికి సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలో రష్మిక హీరో మహేశ్ బాబు గురించి షాకింగ్ కామెంట్ చేసింది.

 

మహేశ్ బాబు పక్కన ఛాన్స్ అనగానే ముందు భయపడిందట రష్మిక. ఎందుకంటే టాలీవుడ్ అందగాడుగా మహేశ్ కు పేరు ఉంది కదా.. అందంలో మహేశ్ తో మ్యాచ్‌ కాగలనో లేదో నని భయపడిందట. తమ మధ్య కెమిస్ట్రీ కుదురుతుందా’ అన్న అనుమానం మొదలైందట. కానీ అంతగా భయపడాల్సిన పని లేదని సెట్స్ కు వెళ్లిన రెండో రోజే తెలిసిపోయిందట రష్మికకు.

 

మహేశ్‌ గొప్ప నటుడే కాదు, చాలా గొప్ప వ్యక్తి కూడా అంటోంది రష్మిక. అందం విషయంలో మహేశ్ కు సరితూగలేనని తెలిసి.. నెమ్మదిగా తనకు తానే సర్దిచెప్పుకుందట. మహేశ్‌బాబుతో డ్యాన్స్‌ చేయడం కష్టమే అంటోందీ ముద్దుగుమ్మ. మహేశ్ షూటింగ్‌కి ముందే పాటలోని స్టెప్పుల్ని ప్రాక్టీసు చేసి వస్తారట. ఒక పాటలో రష్మిక డ్యాన్స్‌ చేయడానికి కంగారు పడుతుంటే... పాటకి తగ్గట్టు స్టెప్పులు ఉండాలంటూ కంగారు పడొద్దని నాకు ధైర్యం చెప్పాడట మహేశ్.

 

మహేశ్ సెట్‌లో ఉన్నారంటే సందడిగా ఉంటుందట. అదే సమయంలో డిసిప్లిన్‌ కూడా బాగా మెయింటైన్ చేస్తాడట. ఒక్క ముక్కలో చెప్పాలంటే సెట్స్‌లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయంలో మహేశ్‌ నుంచి రష్మిక చాలా నేర్చుకుందట. మొత్తానికి సరిలేరు నీకెవ్వరు చేసిన అనుభవంతో ఈ కన్నడ భామ మహేశ్ జపం బాగానే చేస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో.. ఈ అమ్మడి కేరీర్ ను ఏం చేస్తుందో సంక్రాతి తర్వాత గానీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: