తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు అందరు ప్రముఖ హీరోలతో నటించిన టువంటి టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి చెప్పనవసరం లేదు. ఈమె సినీ కెరియ‌ర్ మొద‌లుపెట్టి దాదాపు 15ఏళ్ళ‌వుతుంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఈమె టైం అసలు బాగాలేదు నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఈమె నటించిన టువంటి ఎమ్మెల్యే, కవచం, సీత, రణరంగం, వంటి చిత్రాలు డిజాస్టర్ గా నిలిచి ప్రస్తుతం ఈమె తెలుగు సినీ పరిశ్రమలో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుంది.

 

ఎప్పుడూ క్రేజీ చిత్రాల్లో న‌టిస్తున్నా ఈ సారి మాత్రం కాస్త‌ కొత్త‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోందని, ఈ సారి కాజ‌ల్ ప్రేక్ష‌కుల్ని షాక్‌కు గురిచేయ‌బోతోం దని ఆమె స‌న్నిహితులు చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ హీరోయిన్‌గా ఆక‌ట్టుకున్న కాజ‌ల్ త‌న‌ తాజా చిత్రంలో మాత్రం అందుకు భిన్నంగా నెగెటివ్ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. 1996లో వ‌చ్చిన చిత్రం `భార‌తీయుడు`. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్‌హాస‌న్ న‌టించిన ఈ చిత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది.  బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ల‌ను కొల్ల‌గొట్టింది. ఆ సినిమాకు కొన‌సాగింపుగా `ఇండియ‌న్ 2` పేరుతో ఓ చిత్రాన్ని శంక‌ర్ రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో క‌మ‌ల్‌కు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది.

 

ఇంకా ఈ చిత్రంలో మిగిలిన కీల‌క పాత్ర‌ల్లో హీరో సిద్ధార్ధ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్, బాబీ సింహా, ప్రియాభ‌వానీశంక‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు న‌టిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 20న విడుద‌ల చేయాల‌ని శంక‌ర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ రెగ్యుల‌ర్ హీరోయిన్‌గా కాకుండా క‌మ‌ల్‌హాస‌న్‌ని ఆట‌ప‌ట్టించే నెగెటివ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు త‌మిళ చిత్ర వ‌ర్గాల కథ‌నం. ఆట‌ప‌ట్టించే విధంగా అంటే విల‌న్‌కి ప్ర‌తినాయ‌కురాలిగా చేస్తుందా.. లేక హీరోని ఏద‌న్నా రొమాంటిక్‌గా ఆట‌ప‌ట్టించే విధంగా చేస్తుందా అన్న‌ది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: