విభిన్నమైన కథలతో ప్రేక్షకులని అలరించిన నటుడు అల్లు అర్జున్ అని అనడంలో అతిశయోక్తి లేదు. అల్లు అర్జున్ని ముద్దుగా ఆయన ఇంట్లో 'బన్నీ' అని పిలుస్తుంటారు. అదే పేరు ఆ తరువాత కాలంలో ఫ్యాన్స్కు, సాధారణ ప్రేక్షకులకి కూడా అలవాటైపోయింది. అయితే బన్నీ తన కెరీర్ తొలినాళ్ళలోనే అమ్మాయిలకు ఫేవరెట్ అయ్యాడనడంలో సందేహం లేదు. ప్లే బాయ్ ఇమేజ్తో హాట్ హీరోగా ఉండేవాడు. ఈ క్రమంలో తనకు కాబోయే భార్య ఎలా ఉంటే బాగుంటుందని.. అప్పట్లో మీడియా ప్రశ్నిస్తే, తన ఫాస్ట్ లైఫ్ స్టైల్ని అర్ధమే చేసుకునే భార్య అయితేనే బాగుంటుందని తను తెలిపాడు. 

 

ఎందుకంటే అప్పట్లో బన్నీ ప్రతి వారాంతం పబ్స్లోనే ఎక్కువగా గడిపేవాడట.  ఆ విషయాన్ని ఆయన కూడా పలుమార్లు ఒప్పుకోవడం జరిగింది. మరి ఇటువంటి ఓ విశాల దృక్పథం ఉన్న వ్యక్తికి.. ఎలాంటి భార్య దొరుకుతుందోనని బన్నీ స్నేహితులు, సన్నిహితులు అనుకొనేవారట. ఈ క్రమంలోనే  బన్నీ ప్రేమ వ్యవహారం బయటకి తెలిసింది. ఇంతకీ ఆయన ప్రేమలో పడిన అమ్మాయి మరెవరో కాదు - తనే స్నేహ రెడ్డి.

 

బన్నీకి తన స్నేహితుల ద్వారా పరిచయమైన స్నేహ.. ఆ తర్వాత తన ప్రియురాలిగానూ మారింది. మొదట్లో ఆమె అల్లు అర్జున్ ప్రేమని తిరస్కరించినప్పటికీ.. ఆ తరువాత మళ్లీ తనే ఆయన ప్రేమలో పడిపోయిందట.  ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే - బన్నీకి చిన్నతనం నుండి కూడా సినిమాలు అంటే విపరీతమైన అభిమానం. దాంతో చదువు పైన పెద్దగా ఆసక్తి చూపలేదు. దానితో 10వ తరగతితోనే.. చదువుకి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. మరి స్నేహారెడ్డి విషయానికి వస్తే,  ఆమె అమెరికాలో ఎంఎస్ చేసిన అమ్మాయి. అందుకే వీరి ప్రేమకి చదువు పెద్ద అడ్డంకిగా మారింది. ఇదే టాపిక్ మీద అప్పట్లో చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి. 

 

ఇక అప్పుడు రంగంలోకి దిగిన బన్నీ తండ్రి అల్లు అరవింద్... స్నేహా రెడ్డి కుటుంబసభ్యులతో మాట్లాడారట. ఇరు కుటుంబాలు సమ్మతం తెలిపాక.. ఆయన మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో తమ కుటుంబ విషయాలను.. తమ అనుమతి లేకుండా ఇలా కథనాలుగా ప్రసారం చేయడం పైన.. ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఓ సినిమా కథ మాదిరిగానే.. ఈ ప్రేమకథ అనేక మలుపులు తిరగ్గా..  రకరకాల అడ్డంకుల తరువాత బన్నీ, స్నేహారెడ్డిలు 2011 మార్చి 6వ తేదీన ఒకటయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: