టాలెంట్ ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయంటే ఏమో అనుకోవచ్చు కాని అది నిజమని కొన్ని సార్లు ప్రూవ్ అవుతుంది. ఎక్కడో దిల్లిలో డబ్ స్మాష్ చేస్తూ తన టాలెంట్ చూపిస్తున్న కెతిక శర్మకు తెలుగులో ఆఫర్ రావడం అంటే అది లక్ అని సరిపెట్టడం బాగోదు. తన అందచందాలతో అదరగొడుతున్న కెతిక శర్మ పూరి కంట్లో పడ్డది. వెంటనే తనయుడు ఆకాష్ తో చేస్తున్న రొమాంటిక్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. సినిమాకు టైటిల్ కు తగినట్టుగానే రొమాంటిక్ గా పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక సినిమాలో కెతిక శర్మ అందాల ప్రదర్శన ఓ రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది.

 

అందుకే మొదటి సినిమా రిలీజ్ అవకుండానే మరో సినిమా ఆఫర్ వచ్చిందట. ఏకంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో కెతిక శర్మను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అదే నిజమైతే కెతిక ఫేట్ మారిపోయినట్టే. రెచ్చిపోవడంలో ఏమాత్రం తగ్గని కెతిక శర్మ రొమాంటిక్ మూవీ హిట్ అయితే మాత్రం ఇక అసలు తగ్గదని చెప్పొచ్చు. అంతేకాదు బన్ని సినిమా ఛాన్స్ కన్ఫాం అయితే ఆమెకు మరిన్ని ఆఫర్స్ రావడం గ్యారెంటీ. తొలి సినిమా రిలీజ్ కాకుండానే అమ్మడికి ఈ రేంజ్ లో క్రేజ్ ఉంటె సినిమా రిలీజై హిట్ అయితే మాత్రం ఆ లెక్క వేరేలా ఉంటుంది.

 

చూస్తుంటే కెతిక శర్మ టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేలా ఉందని మాత్రం చెప్పొచ్చు. అసలే హీరోయిన్స్ కరువుగా భావించే టాలీవుడ్ లో ఈ కొత్త అమ్మాయి తన సత్తా చాటేలా ఉంది. రొమాంటిక్ మూవీ మంచి ఫలితాన్ని అందుకుంటే మాత్రం కెతిక శర్మని ఆపడం ఎవరి వల్లా కాదు. ఆకాష్ రొమాంటిక్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేశారు. అనీల్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను పూరి, చార్మి కలిసి నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: