టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు ఈ సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి బ్లాక్ బస్ట‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలోనే ఇంట్లోనే ఉన్న మ‌హేష్ ఈ ఖాళీ టైంలో త‌న పిల్ల‌ల‌తో ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా మ‌హేష్ త‌న ఇంట్లో కుమార్తె సితార‌, కుమారుడు గౌత‌మ్‌తో క‌లిసి ఆట‌లాడుతోన్న ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో మ‌హేష్ సితార‌ను ప‌ట్టుకుని ఉన్నాడు. సితార ఎప్పుడు క్యూట్ లుక్స్‌తో ఎట్రాక్టివ్‌గా, యాక్టివ్‌గాను ఉంటుంది. 

 

ఇక సితార వంశీ పైడిప‌ల్లి కుమార్తెతో క‌లిసి మ‌హేష్‌ను ఇంట‌ర్వ్యూ చేయ‌డం... ఇటు యూట్యూబ్ ఛానెల్లో సంద‌డి చేస్తూ సోష‌ల్ మీడియా ఫ్యాన్స్‌కు కావాల్సినంత ఎంట‌ర్టైన్‌మెంట్ ఇస్తుంటుంది. ఇక మ‌హేష్ కూడా సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా త‌న ఫ్యామిలీకి ఎప్పుడు టైం కేటాయిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. త‌ర‌చూ ఫ్యామిలీతో విదేశాల‌కు చెక్కేస్తుంటాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: