‘ఉయ్యాల జంపాల’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ తన కెరియర్ తొలి నాళ్ళల్లో వరస హిట్స్ ఇస్తూ వచ్చాడు. ‘సినిమా చూపిస్త మావ’ ‘కుమారి 21 ఎఫ్’ సినిమాలకు వరస హిట్స్ రావడంతో రాజ్ తరుణ్ మిడిల్ రేంజ్ హీరోగా చాల సులువుగా సెటిల్ అవుతాడు అని అందరు భావించారు. 


అయితే అంచనాలు తారుమారై గత నాలుగు సంవత్సరాలుగా హిట్ అనే పదం రాజ్ తరుణ్ మరిచిపోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి నినైరాస్యంలో ఉన్న పరిస్థితులలో రాజ్ తరుణ్ కు ఊహించని విధంగా నాగచైతన్య సపోర్ట్ ఈ లాక్ డౌన్ సమయంలో దొరకడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 


గతంలో రాజ్ తరుణ్ తో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ మూవీను తీసిన దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి రాజ్ తరుణ్ ను దృష్టిలో పెట్టుకుని ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథను వ్రాసాడు. అయితే ప్రస్తుతం ఎవరూ రాజ్ తరుణ్ తో సినిమా తీసే సాహసం చేయలేని పరిస్థితులలో ఈ మూవీ ప్రాజెక్ట్ ముందుకు సాగడం లేదు. అయితే శ్రీనివాస్ గవిరెడ్డి గతంలో నాగచైతన్య సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన ప్రరిచయంతో ఈ లాక్ డౌన్ సమయంలో ధైర్యంచేసి నాగచైతన్యకు ఫోన్ లో ఈ కథను వినిపించాడట.


ప్రస్తుతం సినిమా షూటింగ్ లు లేకపోవడంతో ఖాళీగా ఉన్న చైతన్య శ్రీనివాస్ గవిరెడ్డి చెప్పిన కథను పూర్తిగా వినడమే కాకుండా ఈ కథ బాగా తీస్తే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మారుతుంది అని భావించి ఈ మూవీని తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తానే నిర్మితగా మారి ఈ మూవీని నిర్మిస్తాను అని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా షాక్ తో రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ ‘ఒరేయ్ బుజ్జిగా’ ఎప్పుడు విడుదల అవుతుందో కూడ తెలియని పరిస్థితులలో ఇప్పుడు చైతన్య గాడ్ ఫాదర్ గా మారడంతో ఈ లాక్ డౌన్ పిరియడ్ లో హీరోలు అంతా బయటకు చెప్పుకోలేని బాధలలో ఉంటే రాజ్ తరుణ్ కు మాత్రం చైతన్య సహాయంతో మంచి జోష్ లో ఉన్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: