హీరోయిన్లకు పొగడ్తలంటే ఇష్టమనేసంగతి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చార్మింగ్ హీరోయిన్ గా క్యూట్ లుక్స్స్ తో ఆడియెన్స్ డిస్ట్రబ్ చేస్తున్న ఈ బ్యూటీ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూయర్ అన్న మాటలకు తెగ సంబరపడిపోతుందట. ఇతకీ ఆ ఇంటర్వ్యూయర్ ఏమన్నాడనేగా మీ డౌట్..? అబ్బే ఏం లేదండి అతగాడు దాదాపు సుమారు 35 మంది హీరోయిన్స్ ని ఇంటర్వ్యూ చేశాడట ఏ హీరోయిన్ ని మీ డ్రీం రోల్ ఏంటని అడిగినా చాలా వరకు అనుకోకుండా ఒకరోజు చార్మి చేసిన పాత్ర అని చెప్పారట. ఆ విషయాన్నే చిన్నగా చార్మి చెవిన పడేశాడు ఆ ఇంటర్వ్యూయర్ . ఆ మాటలు విన్న చార్మి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందట. చార్మి హీరోయిన్ గా చాలా మంచి సినిమాల్లో నటించింది ఇంకా డిఫరెంట్ నేరేషన్ ఉన్న సినిమాలు ఉదాహరణకు మంత్ర, అనుకోకుండా ఒక రోజు సినిమాల్లో కూడా చేసి ఆడియెన్స్ మెప్పు పొందింది. సో చార్మి చేసిన ఆ క్యారక్టర్స్ ని హీరోయిన్స్ కూడా చేయాలని ఇష్టపడుతున్నారని తెలిసి చార్మి ఆనందపడటంలో తప్పేముంది చెప్పండి. చార్మి ఇప్పుడు తమ్మా రెడ్డి భరద్వాజ్ దర్శకనిర్మాతగా తీస్తున్న ప్రతిఘటన సినిమాలో లీడ్ రోల్ చేస్తుంది. సో అమ్మడు ఇలానే ఇంకొన్ని మంచి సినిమాలను చేయాలను కోరుకుంటుంది ఎపిహెరాల్డ్.కామ్. చార్మి ఆనందపడటంపై మీ కామెంట్..?     

మరింత సమాచారం తెలుసుకోండి: