తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లు తమ హవా నడిచిన విషయం తెలుస్తుంది. స్టార్ హీరోయిన్గా ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. అయితే ఇలా స్టార్ హీరోయిన్గా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలోనే చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని ఆ తర్వాత కుటుంబ బాధ్యతలతో చిత్ర పరిశ్రమకు దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఎదిగి పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయిపోయినా హీరోయిన్లలో ఒకరు అమల. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గానే కాదు ప్రస్తుతం అక్కినేని వారి కోడలిగా కూడా అమలకు ఒక మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. 

 


 నాగార్జున ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అమల లైఫ్ పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకున్న అమల... ఆ తర్వాత అక్కినేని నాగార్జునతో ప్రేమలో  పడింది. ఇక వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకరించడంతో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే అప్పటికే నాగార్జునకు పెళ్లయి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ తర్వాత నాగార్జున తన మొదటి భార్యతో విడాకులు తీసుకోవడంతో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక అమలా పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది అని చెప్పారు. 

 

 కేవలం అక్కినేని వారి ఫ్యామిలీ ని చూసుకుంటూనే గడిపింది. ఒక ఫ్యామిలీ ఉమెన్ గా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించి అమల . అక్కినేని నాగార్జున అమల ప్రేమకు గుర్తుగా అఖిల్ కూడా పుట్టాడు. ఇక ఆ తర్వాత అఖిల్ బాగోగులు చూసుకుంటూ అఖిల్ ని అక్కినేని వారసుడిగా నిలబెట్టడానికి అమల ఎంతగానో కృషి చేసింది అని చెప్పాలి. ఏ తల్లి చేయని సాహసం చేసి అఖిల్ పాలు తాగుతున్న వయసులోనే సినిమా షూటింగులకు పంపించింది అమల. ఇలా చిన్నప్పటి నుంచే తన కొడుకుని హీరోని చేయాలనే తపనతో ఉంది. ఇక ఆ తర్వాత అఖిల్ పెరిగి పెద్దయి  టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: