మళయాల బ్లాక్ బాస్టర్ మూవీ లూసిఫర్ తెలుగులో రీమేక్ కానుందని తెలిసిందే. గత ఏడాది మళయాలంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదలైన లూసిఫర్ ను తెలుగు ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇక ఈ సినిమా రీమేక్ హక్కులను రామ్ చరణ్ దక్కించుకోగా తన తండ్రి మెగా స్టార్ చిరంజీవితో ఈసినిమాను రీమేక్ చేయనున్నాడు.  ఈ రీమేక్ కు దర్శకుడిని కూడా ఫిక్స్ చేశారు. సాహో ఫేమ్ సుజీత్  ఈసినిమా ను డైరెక్టర్ చేయనున్నాడు.
 
ప్రస్తుతం సుజీత్ స్క్రిప్ట్ కు తుది మెరుగులు తిద్దుతున్నాడు. త్వరలోనే చిరు కలిసి ఫుల్ స్క్రిప్ట్ ను వినిపించనున్నాడు. స్క్రిప్ట్ నచ్చితే  దసరాకు ఈ సినిమా ను లాంచ్ చేసి ఈఏడాది చివర్లో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారట. సీనియర్ నటి సుహాసిని ఈ చిత్రంలో నటించనుందని టాక్. ఒరిజినల్ వెర్షన్ లో  మంజూ వారియర్ పోషించిన పాత్రను తెలుగులో  సుహాసిని చేయనుందట. త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. 
 
ఇక చిరు ప్రస్తుతం ఆచార్య లో నటిస్తున్నాడు. టాప్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇటీవల 40శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది అయితే జూన్ లో ఈసినిమా షూటింగ్ ను తిరిగి ప్రారభించాలనుకున్నారు కానీ  తెలంగాణ లో ప్రస్తుతం కరోనా తీవ్ర రూపం దాల్చడం తో ఆ ఆలోచన ను విరమించుకున్నారు. ఆగస్టు లో మళ్ళీ  షూటింగ్  స్టార్ట్ అయ్యేలా వుంది. సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటించనుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ల పై  నిరంజన్ రెడ్డి ,రామ్ చరణ్ సంయుక్తంగా   నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: