సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 24/7 హాట్ టాపిక్ కావలనే అనుకుంటాడా లేదా ఆయన ఏం చేసిన సోషల్ మీడియా 24/7 సంచలనం చేయడానికి సిద్దంగా ఉంటుందా తెలీది గాని ఆయన ఒక చిన్న కామెంట్ చేసినా దాన్ని వార్తగా రాసేసి వైరల్ చేసేస్తున్నారు. లాక్ డౌన్ లో మేకర్స్ అందరు బయటకి రావడానికి భయపడుతుంటే వర్మ మాత్రం ఆయన సొంత థియోటర్స్ లో సినిమాలు తీసి చూసుకుంటున్నారు. అంతేకాదు జనాలకి చూపించి కరోనా కష్టకాలంలో కూడా బాగానే సంపాదిస్తున్నారు. 

 

IHG's Power Star

 

రీసెంట్ గా మియా మాల్కోవాతో క్లైమాక్స్..శ్రీ రాపాక తో నగ్నం..చేసి బాగానే దండుకున్నాడట. నిజంగా వర్మ లాంటి మేకర్ అండ్ బిజినెస్ మాన్ మరొకరుండరనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ అవసరం లేదు. కంటెంట్ లో ఏమీ ఉండని తెలిసిన జనాలని మాగ్నెట్ లాగా లాగేయడం వర్మ "ఇజం". ఇపటికే రెండు సినిమాలు చేసిన అంకిత రాణా కి పేరు మార్చి అప్సర రాణి గా పరిచయం చేశాడు. కొత్త అమ్మాయికి గొప్ప ప్లాట్ ఫాం ఇచ్చినట్టు .. ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. కాని ఆ అమ్మాయి ఎవరో ఇట్టే కనిపెట్టారు జనాలు.

 

IHG'Apsara Rani'!

ఏదేమైనా అప్సర రాణి మాత్రం రెండు సినిమాలు చేసిన ఏవ్రో తెలియంది ఒక్క ఫొటో తో స్టార్ ని చేశాడు. తనతో థ్రిల్లర్ సినిమాని తీస్తున్నాడు. ఇంతలోనే ఆయనకి పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు. అంతే 'పవర్ స్టార్' అనే సినిమా అనౌన్స్ చేశాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు వర్మ. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో త్వరలోనే 'పవర్ స్టార్' సినిమా రిలీజ్ కానుందని తెలిపాడు.

 

IHG

 

ఇక 'పవర్ స్టార్' టైటిల్ లోగో మధ్యలో పవన్ కళ్యాణ్ స్థాపించిన 'జనసేన' పార్టీ ఎలక్షన్ సింబల్ అయిన 'గ్లాస్' ని పెట్టి హాట్ టాపిక్ అయ్యాడు. అంతేకాదు మెగా హీరోలని వాడుకుంటూ డూప్ లతో వర్కింగ్ స్టిల్ ని రిలీజ్ చేసి బాగా పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. ఏదేమైనా వర్మ మళ్ళీ రచ్చ చేయడం ఖాయమనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: