కొన్నిరోజుల లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ విడుదలైనప్పటికీ ఆఫస్ట్ లుక్ ప్రభాస్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడంతో అభిమానులు కొంతవరకు నిరాశ పడ్డారు. ఈసంఘటన జరిగి కొద్దిరోజులు గడవకుండానే నాగ్ అశ్విన్ ప్రభాస్ తో తీయబోతున్న భారీ బడ్జెట్ మూవీలో దీపిక పదుకొనె హీరోయిన్ గా ఎంపిక అయింది అన్నవార్తలు బయటకురాగానే ప్రభాస్ అభిమానుల హడావిడికి ఆకాశమే హద్దుగా మారింది.


ఈమూవీ పాన్ ఇండియా మూవీ కాదని పాన్ వరల్డ్ మూవీగా మారుతుందని అభిమానులు ఊహలలో విహరిస్తున్నారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఈమూవీ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈఏడాది విజయదశమి రోజున మొదలై 2022 లో విడుదల చేయడానికి నాగ్ అశ్విన్ ఈసినిమాకు సబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పరుగులు తీయిస్తున్నాడు.


వాస్తవానికి ఈసినిమాలో నటించడానికి దీపికను ఒప్పించడానికి నాగ్ అశ్విన్ చాల కష్టపడవలసి వచ్చింది అని అంటారు. ఈమూవీలో నటించినందుకు దీపికకు భారీ పారితోషికం ఇవ్వడమే కాకుండా ఈమూవీ బిజినెస్ లో దీపికకు కూడ షేర్ ఇవ్వవలసిన పరిస్థుతులు వచ్చాయి అని టాక్. ఈమూవీలో దీపిక సెలెక్షన్ తో పాన్ వరల్డ్ ఇమేజ్ ఈసినిమాకు వస్తుందని నాగ్ అశ్విన్ ఆలోచన.

 

ఈపరిస్థితులు ఇలా ఉండగా ‘# ప్రభాస్ 21 మూవీలో’ దీపిక నటిస్తోంది అంటు అనేక మీడియా సంస్థలు ప్రచురించిన వార్తల పై దీపిక మరొక విధంగా స్పందించింది.  ప్రభాస్ తో తాను నటిస్తున్న విషయానికి సంబంధించిన వార్తలలో #Prabhas21 అని వ్రాస్తున్నారు అని ఇది కేవలం ప్రభాస్ కెరియర్ కు సంబంధించి 21వ చిత్రం మాత్రమే అనీ హిందీ తమిళ తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈమూవీకి టైటిల్ వేరుగా ఉంటుందని అందువల్ల ఇంకా పేరు పెట్టని సినిమా క్లియర్‌గా రాసినా బాగుండేది కాని ఇలా#Prabhas21 అంటూ వార్తలు రాయడం తనకు నచ్బలేదు అంటూ స్పందించింది. ఇప్పుడు ఈ విషయాలు అన్నీ ప్రభాస్ అభిమానుల దృష్టి  వరకు వెళ్ళడంతో వారు దీపిక పై మండిపడుతూ ఇలాంటి ఓవర్ యాక్షన్ పనికిరాదని ఈమూవీ బ్లాక్ బష్టర్ హిట్ అయితే అది తన వల్లనే అంటూ దీపిక ప్రచారం చేసుకునే ఆస్కారం ఉంది కాబట్టి ఆమెను మొదట్లోనే కంట్రోల్ లో పెట్టమని ప్రభాస్ అభిమానులు నాగ్ అశ్విన్ కు సలహాలు ఇస్తున్నారు. దీనితో ఈ అనుకోని రగడను చూసి నాగ్ అశ్విన్ తల పట్టుకుంటున్నట్లు టాక్..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: