భారీ అంచనాలతో అమెజాన్ ఓటీటీ సంస్థ విడుదల చేసిన ‘వి’ ఫెయిల్ కావడంతో అమెజాన్ సంస్థ వ్యూహాలు అన్నీ మారిపోయాయి అని తెలుస్తోంది. ఈమూవీ విడుదల ముందు అమెజాన్ ప్రైమ్ కు అత్యంత భారీ స్థాయిలో కొత్త సబ్ క్రిప్క్షన్స్ వస్తాయని అమెజాన్ భావించింది అని టాక్.


అయితే అమెజాన్ ఊహించిన స్థాయిలో ఆసంస్థ ప్రైమ్ మెంబర్స్ సంఖ్య ‘వి’ సినిమా వల్ల తెలుగు రాష్ట్రాలలో పెరగలేదు అన్నమాటలు వినిపించాయి. దీనితో అమెజాన్ మార్చుకున్న బిజినెస్ వ్యూహం అక్టోబర్ 2న విడుదల కాబోతున్నా ‘నిశ్శబ్దం’ మూవీ బిజినెస్ ను దెబ్బ తీసింది అన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి.


భారీ అంచనాలతో ‘వి’ మూవీని అమెజాన్ 32 కోట్లకు తీసుకున్నారు అన్న వార్తలు వచ్చాయి. ఈ డీల్ తో నష్టాల బాట పడకుండా దిల్ రాజ్ బయటపడ్డాడు. ‘వి’ ఫలితం నేర్పించిన పాఠాలతో అమెజాన్ చాల జాగ్రత్తలు తీసుకుని అనేక భేరసారాలు చేసి ‘నిశ్శబ్దం’ మూవీని 24 కోట్లకు తీసుకుందని తెలుస్తోంది. వాస్తవానికి ఈమూవీ పై 30 కోట్ల పెట్టుబడి అయిన పరిస్థితులలో నిర్మాత కోన వెంకట్ కు ఈ డీల్ వల్ల 6 కోట్ల నష్టం వచ్చింది అన్న గాసిప్పుల లీకులు వస్తున్నాయి.


అదేవిధంగా ‘నిశ్శబ్దం’ మూవీతో విడుదల కాబోతున్న ‘ఒరేయ్ బుజ్జిగా’ ‘కలర్ ఫోటో’ మూవీలకు కూడ ఓటీటీ సంస్థల నుండి చాల తక్కువ రెట్లు పలికినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అనూహ్యంగా ‘నిశ్శబ్దం’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చి హిట్ అయితే ఇప్పుడు ఓటీటీ సంస్థలతో బెరసారాలలో ఉన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ ‘గుడ్ లక్ సఖి’ ‘మిస్ ఇండియా’ సినిమాలు లాభపడే అవకాశం ఉంది. దీనితో ‘నిశ్శబ్దం’ ఎలాంటి శబ్దాన్ని క్రియేట్ చేస్తుంది అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో బాగా పెరిగిపోయింది. దీనితో ‘నిశ్శబ్దం’ ఫలితం బట్టి తెలుగు సినిమాల ఓటీటీ మార్కెట్ ఆధారపడి ఉంటుంది అన్న అంచనాలు ఉన్నాయి..    

మరింత సమాచారం తెలుసుకోండి: