సినీ ప్రపంచంలో ఒకరు తీసిన సినిమాలు మరొకరు కాపీ కొట్టడం మామూలే. ఇలాంటివి చాలానే జరిగాయి. అయితే చివరికి ఇరువురు రాజీ పదం సర్వసాధారణం అయిపోయాయి. ఇప్పుడు తాజాగా రజినీకాంత్ డైరెక్టర్ కూడా కాపీ కొట్టాడంటూ కోలీవుడ్ సామజిక మాధయ్మలో ప్రచారం జోరుగా సాగుతోంది. తన మొదటి చిత్రం పిజ్జా తోనే సూపర్ హిట్ ను అందుకున్న తమిళ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. అప్పట్లో అందరి హీరోలను ఆకట్టుకున్నాడు. ఇటీవలే జార్తీక్ సుబ్బరాజుకు సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా పేట్టా చిత్రాన్ని తెరకేక్కిన్చాడు కానీ అది ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.  ఇప్పుడు తాజాగా రజిని కాంత్ అల్లుడు ధనుష్ తో జగమే తంత్రమ్ అనే చిత్రాన్ని రూపొందించాడు. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతోంది.

అయితే ఇదంతా ఇలా ఉంటే, ప్రముఖ లేడీ తమిళ్ డైరెక్టర్ సుధా కొంగర.. గౌతమ్ వాసుదేవమీనన్.. సుహాసిని మణిరత్నం.. రాజీవ్ మీనన్ లతో కలిసి కార్తీక్ సుబ్బరాజు పేరుతో రూపొందించిన అంథాలజీ `పుథమ్ పుధు కాలి` మొత్తం ఐదు భాగాలుగా రూపొందింది. ఈ షార్ట్ ఫిల్మ్స్ లలో ఐదవ షార్ట్ ఫిల్మ్ `మిరాకిల్`ని కార్తీక్ సుబ్బరాజు రూపొందించాడు. ఈ స్టోరీని తన వద్ద నుంచి కాపీ కొట్టారని రచయిత అజయన్ బాల ఆరోపిస్తున్నాడు. ఇటీవలే దీన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేశారు.

తన ఫ్రెండ్ వల్ల తెలుసుకున్న అజయన్ బాల తను చేసిన `సచిన్ క్రికెట్ క్లబ్`ని కాపీ చేశారని సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అత్యధిక భాగం విదేశాల్లో ఈ అంథాలజీని తెరకెక్కించారు. పది మంది నేపథ్యంలో సాగే కథ ఇదని ఒక్క రోజులో జరిగే కథ ఇదని అజయన్ బాల చెబుతున్నాడు. `పుథమ్ పుధు కాలి` అంథాలజీ కూడా ఇదే తరహా కథతో సాగుతుండటంతో కార్తీక్ సుబ్బరాజు కూడా కాపీ క్యాట్ గా మారిపోయాడని సెటైర్లు వేస్తున్నారు. మరి దీనిపై ఇంకా స్పందించని కార్తీక్ సుబ్బరాజ్..రానున్న రోజుల్లో ఎలా స్పందిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: