రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం rrr సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా తర్వాత ఏ సినిమాకి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. దాంతో చరణ్ తదుపరి సినిమాడైరెక్టర్ తో చేయబోతున్నాడో అని అందరు తెగ చర్చించుకుంటున్నారు.. అయితే చరణ్ త్రివిక్రమ్ తో సినిమా చేయాలనీ ఏ డైరెక్టర్ తో సినిమా ని ఒప్పుకోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.. నిజానికి రామ్ చరణ్ తో త్రివిక్రమ్ సినిమా ఇదివరకే చేయాలి కానీ ఎందుకు ఆ సినిమా పట్టాలెక్కలేదు.. ఇన్నాళ్లకు ఈ సినిమా కుదరబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యలో మహేష్ బాబు ఈ సినిమా కు అడ్డుపడుతున్నాడని మరో వార్త ఇప్పుడు హల్చల్ అవుతుంది.

ఇక తాజాగా రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా పై వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లు తెలుస్తుంది.. తాను చేయబోయే నెక్స్ట్ సినిమా దర్శకులు పేర్ల ను లీక్ చేసినట్లుగా తెలుస్తుంది.. ముందునుంచి అనుకున్నట్లు త్రివిక్రమ్ తో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడట.. అయితే rrr వెంటనే నా అన్నది తెలియాల్సి ఉంది.. కొరటాల శివ తో కూడా సినిమా చేయబోతున్నాడట చరణ్.. ఈ ఇద్దరు ప్రస్తుతం చెరొక సినిమా తో బిజీ గా ఉన్నాడు.. రామ్ చరణ్ rrr అయిపోయే టైం కి వారు కూడా ఖాళీఅయిపోయి చెర్రీ తో సినిమా మొదలుపెడతారని అంటున్నారు..

ఆచార్య తర్వాత అల్లు అర్జున్‍ సినిమా చేయనున్న కొరటాల తన తదుపరి చిత్రాన్ని చరణ్‍తోనే చేస్తాడట. అయితే త్రివిక్రమ్, కొరటాల కన్నా ముందుచరణ్‍ ఓ సినిమా చేయాలి. అదెవరితో చేయాలనేది ఇంకా ఫిక్స్ అవలేదు. కెజిఎఫ్‍ దర్శకుడు ప్రశాంత్‍ నీల్‍ తెలుగులో అగ్ర హీరోతో ఒక సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఎన్టీఆర్‍, ప్రభాస్‍, మహేష్‍తో అతని ప్రయత్నాలు ఫలించలేదు. అతను కెజిఎఫ్‍ 2 రిలీజ్‍ అయిన తర్వాత చరణ్‍ని కాంటాక్ట్ చేసే అవకాశముందని అంటున్నారు. మరి చరణ్‍తో అయినా అతని సినిమా ఖాయం అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: