తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న లెజెండరీ కమెడియన్ల లో కోట శ్రీనివాస రావు కూడా ఒకరు. మొదట టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అక్కడక్కడ చిన్న పాత్రలు మాత్రమే చేసిన కోట ఆ తర్వాత తన టాలెంట్ తో మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుని మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇక 90 వ దశకంలో మరింత వేగవంతంగా దూసుకెళ్లిన కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్ గా విలన్ గా ఇలా పలు విధాలుగా ఎన్నో పాత్రల్లో నటించి విలక్షణ నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్ని దక్కించుకున్నారు.

ఇక అప్పట్లో బాబు మోహన్  మరియు కోట శ్రీనివాసరావు ల కామెడీ జోడి కి విపరీతమైన క్రేజ్ ఉండేది. వారిద్దరూ ఏదైనా సినిమాలో ఉన్నారు అంటే ఆ సినిమాని చూసిన ప్రేక్షకుల పొట్ట చెక్కలు అవ్వాల్సిందే. ఆ విధంగా ఎన్నో ఏళ్ల పాటు తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కోట శ్రీనివాసరావు ఇటీవల మాత్రం చాలా వరకు సినిమాలు తగ్గించారనే చెప్పాలి. దానికి ప్రధాన కారణం ప్రతి పదేళ్ల క్రితం ఆయన తనయుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ హఠాత్తుగా యాక్సిడెంట్లో దుర్మరణం చెందటం అని తెలుస్తోంది.

కుమారుడి మరణంతో మానసికంగా ఎంతో కుంగిపోయిన కోట శ్రీనివాసరావు ఆ తరువాత నుండి సినిమాలపై శ్రద్ధ తగ్గించారని అలానే ఆపై కొన్నాళ్ల అనంతరం ఆయన ఆరోగ్యం కూడా కొద్దిగా దెబ్బతిన్నదని సమాచారం. అయితే ఇటీవల అక్కడక్కడా చాలా సెలెక్టీవ్ గా మాత్రమే ఆయన సినిమాలు చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ టీవీ ఛానల్లో ఆలీతో సరదాగా షో లో తన మిత్రుడు బాబు మోహన్ తో కలిసి సందడి చేసిన కోట చాలా రోజుల తర్వాత మళ్లీ తన మార్క్ డైలాగ్స్ తో అందరినీ అలరించారు. రాబోయే రోజుల్లో ఆయన మళ్ళీ సినిమాలు చేసి మన అందరిని ఆనందింపచేయాలని కోరుతూ పలువురు  ప్రేక్షకులు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కోట ని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: