‘నాన్నా.. నిన్ను పట్టుకున్నా!  నా నుంచి నువ్వు తప్పించుకోలేవు’ అంటూ సితార ఘట్టమనేని ఇన్‌స్టాలో పెట్టిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మహేశ్ తనయ సితార సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగాతండ్రితో ఉన్న ఫొటోలను, వీడియోలను తరచుగా పోస్ట్ చేస్తుంటుంది. అలాంటి ఓ వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది. వీడియో తీయాలని సితార ప్రయత్నిస్తుండడంతో మహేశ్‌ తప్పించుకుంటున్నారు. కానీ సితార ఎలాగైనా తన తండ్రిని వీడియో తీయాలని ప్రయత్నిస్తుండడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన సితార‘‘నాన్నా నా కెమెరా నుంచి నువ్వు త్పించుకోలేవు’’ అంటూ కామెంట్ చేసింది.


సితార మాత్రమే కాదు.. మహేశ్ కుటుంబంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ  అభిమానులను అలరిస్తుంటారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రాంలో తరచుగా అప్‌డేట్స్ ఇస్తుంటారు. మహేశ్ భార్య, నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితార.. అందరూ సోషల్ మీడియాలో అప్‌టూడేట్ ఉంటారు. ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంటారు              

ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో 41 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు గానూ మహేశ్‌కు నెటిజన్లు విపరీతంగా విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో 41YrsOfSSMBMasteryInTFI అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. నీడ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెరకు పరిచయమైన మహేశ్.. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించారు. రాజకుమారుడు, బాబీ, టక్కరిదొంగ, అతడు, పోకిరి, బిజినెస్ మ్యాన్, భరత్ అను నేను వంటి చిత్రాలతో అభిమానులను అలరించారు. రీసెంట్‌గా సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇప్పుడు సూపర్ స్టార్‌గా.. టాలీవుడ్‌లోనే నెంబర్ వన్ స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం మహేశ్ `సర్కారు వారి పాట` సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ జనవరి నుంచి మొదలు కాబోతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: