సీనియర్ హీరోలు కరోనా భయాల నుండి బయటపడి వరసగా సినిమాలు చేస్తున్నారు. ఈ లిస్టులో బాలకృష్ణ కూడ చేరి బోయపాటితో చేయబోతున్న మూవీని పరువులు తీయించాలి అనే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏ ప్రయత్నం కలిసిరావడం లేదు అన్న సంకేతాలు వస్తున్నాయి.


సినిమా ప్రారంభం అయిన నుండి అన్నీ సమస్యలే మొదట్లో హీరోయిన్ ఎంపిక ఆతరువాత విలన్ ఎంపిక ఈ మూవీకి సమస్యగా మారాయి. ఈ మూవీలో విలన్ పాత్ర చాల పవర్ ఫుల్ అయిన పరిస్థితులలో ఆ పాత్రను సోనూ సూద్ చేత చేయించాలని ప్రయత్నిస్తే అతడు 4 కోట్లు అడిగి చుక్కలు చూపించినట్లు వార్తలు వచ్చాయి.


ఆతరువాత అరవింద్ స్వామిని సంప్రదిస్తే కనీసం అతడి స్పందన కూడ లేదు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనితరువాత ఈ మూవీ ప్రాజెక్ట్ కు విలన్ గా శ్రీకాంత్ నటిస్తాడు అని వార్తలు వచ్చినప్పటికీ అంత పవర్ ఫుల్ విలన్ గా శ్రీకాంత్ సరిపోతాడా అన్న సందేహాలు బోయపాటిలో ఉన్నట్లు టాక్. కరోనా పరిస్థితులు తరువాత మల్టీ ప్లెక్స్ లు తెరుచుకున్నాయి కానీ ఇంకా చాలచోట్ల సింగిల్ ధియేటర్లు పూర్తిగా తెరుచుకోవడం లేదు.


వంద శాతం ఆక్యుపెన్సీ వస్తే కానీ సింగిల్ ధియేటర్లు తెలుగు రాష్ట్రాలలో పూర్తిగా తెరుచుకునే ఆస్కారం లేదు. దీనికితోడు 2021 ద్వితీయార్థం నుంచి 2022 సమ్మర్ వరకు చాల పెద్ద సినిమాలు ఇప్పటి నుండే డేట్స్ ఫిక్స్ చేసుకుని క్యూలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈమూవీని జనవరి ముంచి కానీ ఫిబ్రవరి నుంచి కానీ మొదలుపెట్టి పూర్తిచేసినా ఈ మూవీ రిలీక్ కు సరైన రిలీజ్ డేట్ దొరకడం మరొక సమస్య అవుతుందని అనే అభిప్రాయంలో బోయపాటి కూడ ఉన్నట్లు టాక్. ఇప్పటికే ఈమూవీ ప్రాజెక్ట్ వ్యయం 70 కోట్లు అన్న వార్తలు వస్తున్నాయి. ఇంత బడ్జెట్ తో కష్టపడి సినిమాను పూర్తిచేసినా ఈ మూవీకి మార్కెట్ సమస్యలు ఏర్పడితే ఈమూవీ ఎలా విడుదల చేయాలి అన్న టెన్షన్ లో బోయపాటి ఉన్నట్లుగా గాసిప్పులు హల్ చల్ చేస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: