రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి అదిరిపోయే రేంజ్ లో ట్యూన్స్ ని ఇప్పటికే సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా విషయమై ప్రస్తుతం ఒక వార్త పలు ఫిలిం నగర్ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. దాని ప్రకారం గతంలో తాను చేసిన ప్రయోగాల మాదిరిగా కాకుండా కొంత సేఫ్ జోన్ లో ఈ సినిమాని తెస్తున్నాడట దర్శకుడు సుకుమార్.
ఇటీవల వచ్చిన రంగస్థలం మాదిరిగా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా ప్రతి ప్రేక్షకుడికి అర్ధం అయ్యేలా పక్కాగా స్క్రిప్ట్ రాసుకున్న సుకుమార్ ఇందులో పలు కమర్షియల్ అంశాలు కూడా జోడిస్తున్నాడట. మొత్తంగా చూసుకున్నట్లైతే ఈ సినిమా ద్వారా సుకుమార్ మరొక హిట్ కొట్టేలా ఉన్నారని అంటున్నారు. మరోవైపు ఇటీవల అలవైకుంఠపురములో మూవీ తో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్, ఈ సినిమాతో కూడా మరొక సక్సెస్ కొడితే ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు అనే చెప్పాలి. మరి ఈ సినిమా ఎంతమేర సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకు వెయిట్ చేయాలి.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి