ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...బిగ్ బాస్ 4 తో మంచి పేరు సంపాదించింది  మోనాల్ గజ్జర్... ఆ తర్వాత వెంటనే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా "అల్లుడు అదుర్స్"లో ఐటమ్ సాంగ్ చేసే ఆఫర్ కొట్టేసింది మోనాల్ గజ్జర్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన  ఈ సినిమా సంక్రాంతి రోజున సందడి చేస్తుంది.ఈ సినిమాలో  దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన ఈ సాంగ్ ఎలా ఉండబోతోంది అనేది ముందుగానే చూపించింది మూవీ టీమ్. రంభ , ఊర్వశి , మేనక అందర్నీ కలిపేస్తే నేనిక అంటూ ఐటమ్ సాంగ్ లో తన విశ్వరూపం చూపించింది ఈ హాట్ బ్యూటీ...

ఇప్పుడు ఈసాంగ్ యు ట్యూబ్  ట్రెండింగ్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. మోనాల్ గ్లామర్, బెల్లంకొండ డ్యాన్స్, వీరిద్దరితో పాటుగా ఈక్వల్ గా డ్యాన్స్ చేస్తూ సోనూసూద్ ఈ ముగ్గురి మద్యలో సాగే ఈ ఐటమ్ సాంగ్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. రిలీజైన కొన్ని గంటల్లోనే అత్యధికంగా లైక్స్ సాధించింది ఈ పాట. శ్రీమణి అందించిన బాణీలు, దేవిశ్రీ బీట్ , మోనాల్ ఊపు, బెల్లంకొండ తోపు డ్యాన్స్ అన్నీ కలిపి ఈసాంగ్ ని సెన్సేషనల్ హిట్ చేశాయి.ఈ సంక్రాంతికి ఎలాంటి సినిమా ఉండాలో పక్కా అలాంటి సినిమానే రాబోతోందని ముందుగానే ఆడియన్స్ ని ప్రిపేర్ చేశారు.

బెల్లంకొండ హీరోగా గతంలో వచ్చిన మూవీ రాక్షసుడు సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయని కాన్ఫిడెంట్ గా ఉంది మూవీ టీమ్.ఈ సినిమాతో బెల్లం కొండ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: