పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 2018లో అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి పూర్తిగా గ్యాప్ ఇచ్చారు. మళ్లీ మూడేళ్ల తర్వాత ఇప్పుడు వకీల్ సాబ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానుల్లో మళ్లీ ఆనందం పుట్టుకొచ్చింది. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన వకీల్ సాబ్ టీజర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. విడుదలైన మూడు గంటల్లోనే ముప్పై లక్షల మంది ఈ టీజర్‌ను చూడగా.. ఆరు లక్షల మంది టీజర్‌ను లైక్ చేశారు. టీజర్‌ను గమనిస్తే పవన్ కల్యాణ్ ఇంటెన్స్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరించనున్నట్టు అర్థమవుతోంది. కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు అంటూ వచ్చే డైలాగ్ పవన్ కల్యాణ్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

ఇక ఈ సినిమాలో పవర్ ఫుల్ ఫైట్లు చాలానే ఉన్నట్టు తెలుస్తోంది. మెట్రోలో ఓ ఫైట్ సీన్ ఉన్నట్టు టీజర్ ద్వారా అర్థమవుతోంది. వకీల్ సాబ్ హిందీ చిత్రం పింక్ రీమేక్‌గా వస్తున్న విషయం తెలిసిందే. నిజానికి హిందీలో అమితాబ్ బచ్చన్ మెయిన్ క్యారెక్టర్‌లో నటించగా.. ఆయన ఎటువంటి ఫైట్లు చేయడం ఉండదు. కానీ.. తెలుగు రీమేక్ విషయానికి వచ్చే సరికి డైరెక్టర్ పూర్తిగా స్వేచ్చ తీసుకుని పవన్ కల్యాణ్‌కు తగ్గట్టు స్టోరీని మార్చినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. సరిగ్గా గబ్బర్ సింగ్ సినిమా సమయంలోనూ ఇదే జరిగింది.

ఆ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని పవన్ కల్యాణ్‌కు తగ్గట్టు మార్చారు. గబ్బర్ సింగ్ సినిమా ఏ విధంగా చరిత్ర సృష్టించిందో అందరం చూశాం. ఇప్పుడు వకీల్ సాబ్ విషయంలోనూ అదే జరుగుతుందని పవన్ కల్యాణ్ అభిమానులు అంటున్నారు. వకీల్ సాబ్ సినిమా గబ్బర్ సింగ్ సినిమా కంటే పెద్ద హిట్ అవుతుందని.. తెలుగు ఇండస్ట్రీలో మరో రికార్డును సాధిస్తుందని దీమా వ్యక్తం చేస్తున్నారు. మరి వకీల్ సాబ్‌ సినిమా పవన్ కల్యాణ్‌కు మంచి హిట్‌ను అందించాలని మనం కూడా కోరుకుందాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: