ఒకప్పుడు టాలీవుడ్ ఫీమేల్ యాంకర్ అంటే అక్కడికే పరిమితం అయ్యేవారు కానీ ఈ మధ్య వెండితెర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో అందంతో పాటు నటన తో ఆకట్టుకుంటున్నారు. అనసూయ, రష్మిల గురించి ఎంత చెప్పిన తక్కువే తమ హాట్ హాట్ అందాలతో బుల్లితెర ప్రేక్షకులను తమవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. కేవలం బుల్లితెరఫై మాత్రమే కాదు వెండితెర అవకాశాలు కూడా దక్కించుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

తాజాగా వీరికి పోటీగా వర్షిణి సిద్దమయ్యింది. ముద్దు ముద్దు మాటలతో.. అందమైన నవ్వుతో యువత గుండెల్లో నిద్రలేకుండా చేస్తుంది. ఈ భామ చేసే కామెడీ, ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ చూసి బుల్లి తెర అభిమానులు ఫిదా అవుతున్నారు. వర్షిణి.. అనసూయ, రష్మీని తలదన్నేలా యాంకరింగ్ చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మోడల్ గా కెరీర్ ప్రారంభించి యాంకర్ గానూ, వెబ్ సీరీస్ లలో లీడ్ క్యారక్టర్లతో రాణిస్తున్న ఈ భామ.. సోషల్ మీడియా లోను రచ్చ రచ్చ చేస్తుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ తోనే కాకుండా హాట్ డాన్సులతో కూడా అదరగొడుతుంది.

ప్రస్తుతం ఈ భామ ఫోకస్ అంత వెండితెర ఫై అదరగొట్టాలని చూస్తుంది. గతంలో శంభో శివ శంభో చిత్రంలో చిన్న పాత్ర చేసిన తరువాత ఆమె జాతీయ పురస్కారం గెలుచుకున్న చందమామ కథలు సినిమాలో కూడా నటించింది. లవర్స్ , కాయ్ రాజా కాయ్, బెస్ట్ యాక్టర్స్ సినిమాల్లోనూ నటించింది వర్షిణి. అన్నపూర్ణ స్టూడియో సమర్పించిన పెళ్ళి గొల అనే వెబ్ సిరీస్‌లో నటించి మంచిపేరు తెచ్చుకుంది. కానీ అమ్మడు మాత్రం బిజీ కాలేకపోయింది. కానీ ఇప్పుడు యాంకర్ గా రాణిస్తుండడంతో పాటు తనలో అసలైన అందాలను బయటకు చూపిస్తూ అందర్నీ తన వైపు తిప్పుకుండడం తో వెండితెర ఛాన్స్ లు రావడం పక్క అని అంత ఫిక్స్ అవుతున్నారు. మరి వర్షిణి కి ఎలాంటి ఛాన్సులు వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: