టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  మహేష్-త్రివిక్రమ్.. ఎన్టీఆర్-రాజమౌళి.. బన్నీ-కొరటాల ఇలా కొన్ని కాంబినేషన్స్ అనగానే అభిమానుల అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతాయి. ఒకసారి ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ప్రకటించాక దాదాపుగా అవి క్యాన్సిల్ అవడం కష్టమే. అసలే ఇప్పుడు బిగ్ స్టార్స్.. టాప్ డైరెక్టర్స్ సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు అనుకున్న కాంబినేషన్స్ మొత్తం తారుమారు అయ్యాయి. అది కూడా ఒకటో రెండో కాదు ఏకంగా ఒకరి సినిమాలు మరొకరికి.. ఒక హీరోతో అనుకున్న దర్శకుడు మరో హీరోకు ఫిక్స్ అయిపోయాడు.ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చేసున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఒక కొలిక్కి వచ్చే వరకు మరో సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదు.

కానీ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా సెట్ చేసుకున్నాడు. అయినను హస్తినకు పోయిరావలె అనే టైటిల్ కూడా ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా తాజాగా తన 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో ఉండనుందని పోస్టర్ వదిలారు. దీంతో అసలు త్రివిక్రమ్ సినిమా ఏమైంది.. అసలు ఉందా.. లేదా అనే చర్చలు మొదలయ్యాయి.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న కొరటాల శివ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఏమైందో ఏమో ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ వచ్చింది.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చేస్తున్న అల్లు అర్జున్ తర్వాత చేయాల్సిన కొరటాల సినిమా ఉంటుందా ఉండదా అన్న చర్చ కూడా మొదలైంది. ఇక.. ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ తో సినిమా చేయనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం మహేష్ చేస్తున్న సర్కారు వారి పాట త్రివిక్రమ్ సినిమా మొదలుకానుందని చెప్తున్నారు.త్రివిక్రమ్ తో సినిమా అనుకున్న ఎన్టీఆర్ కొరటాలను ఫైనల్ చేసుకుంటే.. కొరటాలతో సినిమా అనుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ తో హస్తినకు వెళ్లాలనుకున్న త్రివిక్రమ్ మహేష్ తో సినిమా చేయడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: