సినిమా పరిశ్రమలో అప్పుడప్పుడు మంచి కాంబినేషన్ లు సెట్ అవుతుంటాయి. అలాగే ఎవరూ ఊహించని కాంబినేషన్ లు కూడా సెట్ అవుతుంటాయి. అవి సెట్ అయినట్టు అధికారిక ప్రకటన వచ్చినట్లే వచ్చి మళ్ళీ రధ్ధయి పోతుంటాయి. ఇక అలాగే మొన్నటికి మొన్న ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ సినిమా ఆగిపోయిందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత నిజమయ్యాయి. ఆ తర్వాత అల్లు అర్జున్‌ - కొరటాల సినిమా విషయంలో ఇలాంటి పుకార్లే మొదలయ్యాయి. అది మరచిపోక ముందే మరో సినిమా వార్తల్లోకి వచ్చింది.సుమారు ఏడు నెలల క్రితం సుకుమార్‌ - విజయ్‌ దేవరకొండ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్‌ స్నేహితుడు కేదార్‌ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుందని చెప్పారు.పాపం విజయ్ కూడా పెద్ద డైరెక్టర్ పైగా సుకుమార్ లాంటి డైరెక్టర్ నుంచి బంపర్ ఆఫర్ రావడంతో అత్యుత్సాహంతో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అధికారికంగా వెల్లడించాడు.

విజయ్ అయితే ప్రకటించాడే కాని సుకుమార్ అయితే ఎక్కడ ఈ సినిమా ఉంటుందని ప్రస్తావించలేదు. సినిమా గురించి ఎక్కడా చర్చ లేదు. ఓవైపు విజయ్‌ 'లైగర్‌' షూటింగ్‌లోను, మరోవైపు సుకుమార్‌ 'పుష్ప' షూటింగ్‌లోనూ బిజీగా ఉండటం వల్ల వాళ్ల కాంబో గురించి ఎక్కడా, ఏమీ మాట్లాడటం లేదేమో అనుకున్నారు. అయితే ఈ సినిమా ఆలోచనను విరమించుకునే ఆలోచనలో ఉన్నారని లేటెస్ట్‌ గా సమాచారం అందుతుంది.ఈ నేపథ్యంలో విజయ్‌ దేవరకొండ 'లైగర్‌' తర్వాత ఏ సినిమా చేస్తాడు అనే విషయంలో సరైన స్పష్టత లేదు. సుకుమార్‌ అయితే రామ్‌చరణ్‌తో సినిమా చేస్తాడని వార్తలు అప్పుడే మొదలయ్యాయి. 'రంగ స్థలం' తర్వాత వారి కాంబో మరో సినిమా వస్తుందని అప్పుడే వార్తలొచ్చాయి. ఆ సినిమా ఇదే అని టాక్‌. అయితే విజయ్ దేవరకొండ సినిమా ఎందుకు ఆగిపోయిందనేది తెలియదు. అందుతున్న సమాచారం ప్రకారం అయితే సుకుమార్ కి విజయ్ తో సినిమా చెయ్యడం ఇష్టం లేదట. అతనికి బదులు రామ్ చరణ్ తో సినిమా చెయ్యాలని సుక్కు భావిస్తున్నాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: