అల్లు అర్జున్ హార్డ్ వర్కింగ్ నేచర్ గురించి ఎంత చెప్పినా అది తక్కువే.  షూటింగ్ స్పాట్ కు వెళ్ళినతరువాత తన పాత్ర గురించి పూర్తిగా ఇన్వాల్వ్ అవుతూ దర్శకులకు మారిత ఉతాహాన్ని కలిగిస్తూ ఉంటాడు. బన్నీలో ఉన్న ఈగొప్ప లక్షణాలన్నీ అతడిని అతి తక్కువ కాలంలో టాప్ యంగ్ హీరో స్థాయికి తీసుకు వెళ్ళాయి.


ప్రస్తుతం బన్ని నటిస్తున్న ‘పుష్ప’ ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో  తీయబడుతున్న భారీ యాక్షన్ మూవీ. ఈ మూవీలో పుష్ప రాజ్ అనే డేంజరస్  స్మగ్లర్ గా బన్నీ  నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ లోని పుష్ప రాజ్ లుక్ కు విపరీత మైన క్రేజ్ వచ్చింది.




ఈ మూవీలోని బన్ని లుక్ ను చూసిన వారు తన క్యారెక్టరైజేషన్ కోసం అతడు పడే కష్టం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో  అల్లు అర్జున్  ఫాల్కాన్ కార్వాన్ డ్రైవర్ లక్ష్మణ్ బన్నీ కష్టం గురించి చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి. ‘పుష్ప’ షూటింగ్ కోసం తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం దగ్గర డీ ఫారెస్ట్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు  ఫాల్కాన్ కొంత దూరం మాత్రమే ప్రయాణించగలడనీ అక్కడ నుంచి స్పాట్ కి చేరుకోవడానికి మరో మార్గం వెదుక్కోవాల్సిందే అంటూ తాను చెప్పిన మాటకు నవ్వుతూ అంగీకరించిన విషయాన్ని బయటపెట్టాడు.


ఆతరువాత షూటింగ్ స్పాట్ చేరుకోవడానికి సుమారు గంటన్నర ఒక మోటార్ బైక్ పై ప్రయాణం చేసి షూటింగ్ స్పాట్ కు చేరుకునే వాడని దీనికోసం అతడు తెల్లవారు ఝామున మూడు గంటలకు లేచి తన పనులన్నీ పూర్తిచేసుకుని షూటింగ్ స్పాట్ రావడమే కాకుండా కనీసం అలసట కూడ లేకుండా ప్రవర్తించిన తీరు తనకు ఆశ్చర్యాన్ని కలిగించింది అంటూ బన్నీ కార్వాన్ డ్రైవర్ కామెంట్ చేసాడు. షూటింగ్ స్పాట్ నుండి తిరిగి రాజమండ్రిలోని అతడు ఉంటున్న హోటల్ కు చేరుకునే సరికి అర్థరాత్రి అయ్యేదని ఆ రెండు నెలలు బన్నీ కేవలం రోజుకు మూడు గంటలు మాత్రమే పడుకున్నాడు అంటూ అభిమానులకు జోష్ ను కలిగించే ఆవిషయాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: