
ఈరోజు బాలయ్య బాబు తన 61వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన అభిమానులు జాతీయస్థాయిలో , ట్విట్టర్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాదు నందమూరి ఫ్యామిలీ నుంచి కొంతమంది ప్రత్యేక శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. ఇక ఆయన కుటుంబీకులు చెప్పిన జన్మదిన శుభాకాంక్షలు ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారాయి. అయితే ఎవరెవరు ఏమేమి ట్వీట్ చేశారో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
1. జూనియర్ ఎన్టీఆర్:
జూనియర్ ఎన్టీఆర్ తన చిన్నాన్న పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ చేశారు. చిన్నాన్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పటికీ ఆయురారోగ్యాలతో నిత్యం సంతోషంగా ఉండాలి , అంతే కాదు మీరు చేసే ఏ పని అయినా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
2. కళ్యాణ్ రామ్:
ఇక జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసిన కొంత సమయానికి కళ్యాణ్ రామ్ కూడా తన బాబాయ్ బాలకృష్ణకు బర్తడే విషెస్ తెలిపారు.. ఇక ఇందులో భాగంగానే ఆయన.. 61వ పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయురారోగ్యాలతో నిత్యం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.
3. నారా బ్రాహ్మణి:
నందమూరి బాలకృష్ణ ముద్దుల కూతురు నారా బ్రాహ్మణి కూడా తన తండ్రికి 61 వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాదు ఆమె సోషల్ మీడియా ద్వారా పవర్ హౌస్ అని తన తండ్రిని పొగడ్తలతో ముంచెత్తారు.
4. చిరంజీవి:
ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా బాలకృష్ణకు 61 వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తన ట్విట్టర్ ద్వారా.. స్నేహితుడు బాలకృష్ణ మీరు ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు.
అంతేకాకుండా నందమూరి అభిమానులు ట్విట్టర్ ద్వారా ట్వీట్ లు పెడుతుంటే జాతీయస్థాయిలో ఆయన పేరు మారుమ్రోగుతోంది.