
తెలుగు చలన చిత్రసీమలో లేడీ సూపర్ స్టార్ గా విజయశాంతి అందరికీ సుపరిచితమే. తన నటనతో కోట్లాదిమంది అభిమానాన్ని అందుకున్న ఈమె వివిధ రకాల భాషల చిత్రాల్లో కలిపి సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్టార్ హీరోలందరితో కలిసి నటించి ఆమె లేడీ సూపర్ స్టార్ గా , లేడీ అమితాబ్ దక్షిణ భారతదేశంలో పిలవబడుతోంది. జయసుధ, జయప్రద, శ్రీదేవి, మాధవి లు తమ అభినయంతో తెలుగు తెరను ఏలుతున్న ఉన్న రోజులలో విజయశాంతి 1979 లో తొలిసారి కథానాయికగా కెమెరా ముందుకు వచ్చింది అప్పుడు ఆమె వయసు 17 ఏళ్లు మాత్రమే.
భారతీరాజా వంటి దర్శకుడి దర్శకత్వంలో కల్లకుల్ ఈరమ్ అనే తమిళ సినిమా ద్వారా ఆమె సినిమా పరిశ్రమలోకి పరిచయమై ఆ తరువాత కిలాడి కృష్ణుడు అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయింది. కృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాకి విజయనిర్మల దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఆమె వరుస తమిళ సినిమాలు చేస్తూ రాగా మధ్యలో ఒకటి రెండు తెలుగు సినిమాల ద్వారా హీరోయిన్ నిలదొక్కుకుంది. ఎప్పుడైతే తెలుగు లో స్టార్ హీరోయిన్ అయిందో అప్పటి నుంచి వరుస తెలుగు సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది. హిందీలో సైతం కొన్ని సినిమాల్లో చేసి దేశమంతటా మంచి ఫ్యాన్స్ను ఏర్పరుచుకుంది
1991వ సంవత్సరంలో కర్తవ్యం సినిమాలో ఆమె నటించిన నటనకు గాను జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. విజయశాంతి ఏడుసార్లు దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు,ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లను పొందింది. నాలుగు రాష్ట్ర నంది అవార్డులను కూడా అందుకుంది. 1985లో ప్రతిఘటన సినిమాలో పాత్రకు నంది అవార్డు పొందిన ఆమె ఆ తర్వాత చిరంజీవితో కలిసి నటించిన స్వయంకృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో మరియు హాలీవుడ్ నటుడు థామస్ జనే తో నటించిన పడమటి సంధ్యారాగం సినిమా లాస్వెవెల్లిస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపపడ్డాయి.