ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్ తరచూ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఇటీవల పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో ఆమె వార్ పెయింట్ మేకప్ వేసుకుంటూ కనిపించారు. మరొక ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో ఆమె కారులో కూర్చుని డాన్స్ చేస్తూ కనిపించారు.



వ్యాక్సిన్ తీసుకున్నానని ఆమె ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఫాన్సీ బ్లాక్ మాస్క్ తో స్టైలిష్ టోపీతో ఆమె చాలా ఆకర్షణీయంగా కనిపించారు. ఇక తన కుక్క తో ఆడుకుంటున్న వీడియో కూడా షేర్ చేశారు.



అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ వర్క్ ఔట్ చేసిన అనంతరం తనకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ ఫోటోలో చెదిరిన జట్టుతో కనిపించారు. అయితే ఏ మేకప్ లేకుండా ఆమె చాలా నేచురల్ గా కనిపించారు. దీంతో ఈ ఫోటోలకి మరింత అందం వచ్చింది. ఇక ఆమె కిల్లింగ్ స్మైల్ ఈ ఫోటోలని సెక్సీగా మార్చాయి. అయితే ఈ ఫోటోలకు కింద ఆమె ఈ విధంగా పేర్కొన్నారు.



"కఠినమైన ట్రైనింగ్ ని మళ్ళీ మొదలు పెట్టాను. ప్రస్తుతం నేను నా బాడీని, మైండ్ ని బలపరచుకుంటున్నాను. ఈ రోజు డబుల్ వర్కౌట్ చేశాను. ఎందుకంటే ఈ లాక్ డౌన్ సమయంలో అందరిలాగానే వ్యాయామాన్ని కాస్త నిర్లక్ష్యం చేసి తేలికగా వ్యవహరించాను. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మళ్లీ యధావిధిగా వ్యాయామం చేయడమే. మనల్ని మనం మానసికంగా శిక్షించుకోవద్దు. కొత్త మైండ్ సెట్ తో మీకు మీరు ప్రతిఫలం పొందాలి. మీరు ఇష్టపడే వర్క్ అవుట్స్ ఏంటో నాకు చెప్పండి ?? నాకు ఫైట్ ట్రైనింగ్ అంటే ఇష్టం. అలాగే ఆ ఫైట్ ట్రైనింగ్ ని కార్డియోతో మిక్స్ చేయడం చాలా ఇష్టం. నేను 1990 కాలం నాటి సంగీతం వింటూ గంటలకొద్దీ డాన్స్ చేస్తాను, " అని శృతి హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: