కోలీవుడ్ స్టార్
హీరో అజిత్ కు తెలుగులో కూడా మంచి
మార్కెట్ ను సంపాదించుకున్నారు. ఆయన నటిస్తున్న సినిమాలు అన్ని తెలుగులో కూడా విడుదల కావడంతో ఆయన కు భారీ అభిమానం ఏర్పడింది. మొదటి నుంచి ఆయన తెలుగు
సినిమా మార్కెట్ పై దృష్టి పెడుతూ ఆయన నటించిన సినిమాలను ఇక్కడ కూడా విడుదల చేస్తూ వచ్చారు. ఆ సినిమాలు హిట్ కావడంతో ఆయనకు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ప్రస్తుతం ఆయన వాలిమై అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో
టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు. ఈ
సినిమా మొదలై ఏడాది ఆవుతున్నా ఈ
సినిమా నుంచి ఒక అప్ డేట్ కూడా రాకపోవడంతో అభిమానులు ఈ
సినిమా పరిస్థితి ఏంటో అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు టైటిల్ మాత్రమే రివీల్ చేశారు తప్పితే ఏ అప్డేట్ మాత్రం రిలీజ్ చేయలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక రీజన్ చెబుతూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం లేదు. దాంతో ఇంకెప్పుడు అప్డేట్ ఇస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
అజిత్ అభిమానులు.
ఇదిలా ఉంటే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాకముందే ఈ సినిమాకి తమిళనాడులో భారీ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఒక్క అప్డేట్ కూడా రాకుండానే 65 కోట్ల బిజినెస్ సాధించుకోవడం అంటే ఈ సినిమాకు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ
సినిమా ఫస్ట్ లుక్ మే 1న రిలీజ్ అయ్యేదే కానీ
కరోనా కారణంగా రిలీజ్ చేయడం లేదు అని చెప్పారు మేకర్స్. ఇప్పుడు ఈ సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ జరగడంతో
సినిమా ఫస్ట్ లుక్ ఇంకెలా ఉంటుందో అని అభిమానులు అంటున్నారు. ఇకపోతే ఇప్పుడు
కరోనా తర్వాత అన్ని పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ
సినిమా లుక్ ను త్వరలోనే రిలీజ్ చేస్తామని చెబుతున్నారు మేకర్స్. మరి వారు చెప్పే దాంట్లో ఎంత వరకు నిజం ఉందో చూడాలి. ఈ సినిమాలో
కార్తికేయ కూడా నటించడంతో
టాలీవుడ్ ప్రేక్షకులు అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.