రాజమౌళి డైరెక్షన్లో సినిమా అంటే ఎంతో మంది నటించడానికి ఇష్టపడ్డారు. కారణం ఈయన డైరెక్షన్లో సినిమా చేస్తే కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ కి ఎదిగి పోవచ్చు అని. ఇక తమ అభిమాన హీరో అతని డైరెక్షన్లో సినిమా చేస్తున్నారంటే  బ్లాక్ బాస్టర్ హిట్టు అన్నట్లే ఉంటారు. ఇక ప్రస్తుతం రాజమౌళి rrr సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా అమాంతం హైప్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కూడా ఒక పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.


రాజమౌళి అంటేనే ఎంతో పకడ్బందీగా సినిమాని తెరకెక్కిస్తున్నారు. తనదైన శైలిలో సినిమాను తెరకెక్కించి, అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. rrr  నుంచి చాలా రోజుల తర్వాత ఒక అప్డేట్ రావడంతో.. ఆకలి మీద ఉన్న హీరో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ చిత్రం దాదాపుగా పూర్తి కావస్తోంది. చివరగా రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

అంతేకాకుండా ఈ చిత్రం రెండు భాషలలో విడుదలవుతుండగా.. అందులో కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్ పూర్తి చేశారని సమాచారం. అయితే తాజాగా రామ్ చరణ్ , ఎన్టీఆర్ బైకు మీద చక్కర్లు కొడుతున్నట్లు ఒక ఫోటో ని విడుదలచేశారు. ఈ చిత్ర దర్శక నిర్మాతలు. ఇద్దరూ ఓకే బైక్ మీద కనువిందు చేస్తుంటే అభిమానులకు చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు ఈ పోస్టర్ ను  సైబరాబాద్ ట్రాఫిక్  పోలీసులు కూడా వదలడం లేదు.. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.




హైదరాబాద్ లోని సైబరాబాద్ పోలీసులు ప్రజల క్షేమం కోసం ఎప్పటికప్పుడు వినూత్న పద్ధతులను అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇక అంతే కాదు వీరు తీసుకొచ్చి ఏ పద్ధతి అయినా  సరే ప్రజలకే కాకుండా అందరికీ వర్తిస్తుంది అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. కరోనా సమయంలో సైబర్ పోలీసులు ఒక వినూత్నమైన యాప్ ని క్రియేట్ చేసి, ప్రజలు ఇబ్బందిపడకుండా  వాక్సినేషన్ రిజిస్ట్రేషన్ సెంటర్ లు , కోవిడ్ఆస్పత్రులు, బెడ్ లు ఇలా అన్నీ  ఎక్కడ ఖాళీ ఉన్నాయో తెలుసుకునేందుకు ,ఇంట్లో కూర్చొని సులభంగా తెలుసుకునే పద్ధతులను ప్రవేశపెట్టారు. ఇక అంతే కాకుండా ఇప్పుడు మరో సారి ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం మీద వెళ్లేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని చెబుతున్నారు. ఇటీవల సినీ ఇండస్ట్రీపై కూడా వీరు ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆర్ఆర్ఆర్  మూవీ కి సంబంధించిన ఒక పోస్టర్ విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే  సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ ఫోటోను తీసుకొని మార్ఫింగ్ చేసి వారిద్దరికీ కూడా హెల్మెట్ తగిలించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.  ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: