అలనాటి నటీమణుల్లో హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంది హీరోయిన్ ఆమని. శుభలగ్నం, మావిచిగురు వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక అభిమానం ఏర్పరుచుకుని హీరోయిన్ గా చాలా సినిమాల్లో మంచి పాత్రలు పోషించింది. మిస్టర్ పెళ్ళాం సినిమాలో ఆమె పేరు అంతా ఇంతా కాదు. సంకల్పం సినిమా ద్వారా దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తన అందం అభినయంతో అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుని ఇప్పుడు వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను మరోసారి ఆలోచిస్తుంది.

విశ్వనాథ్, బాపు వంటి స్టార్ దర్శకులతో సైతం పనిచేసిన ఆమె కమర్షియల్ దర్శకులైన రాఘవేంద్రరావు, ఈ వి వి సత్యనారాయణ, ఎస్వీకృష్ణారెడ్డి లతో కూడా ఎన్నో సినిమాలు చేసి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అప్పట్లో ఆమెకు స్టార్ హీరోల నుంచి మరింత అభిమానం ఉండేది. ఆమె తమ సినిమాల్లో నటించాలని వారు ఎంతగానో అనుకునేవారు. దర్శక నిర్మాతలపై ఆమె నటించడానికి ఒప్పించాలని ఒత్తిడి చేసేవారట. అయితే ఎంతో మంది టాప్ హీరోల సరసన నటించింది కానీ చిరంజీవితో మాత్రం సినిమా చేయలేకపోయింది.
ఈ కోరిక ను ఎప్పటికైనా తీసుకుంటా అని చెప్తుంది.

తెలుగు సినిమా జంబలకడిపంబ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమని కి చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలనే కోరిక ఉండేది. తన తండ్రికి తెలిసిన డిస్ట్రిబ్యూటర్ చెన్నైలో ఉండడంతో అక్కడికి ఈమె వెళ్లిందట. సినిమాల్లో అవకాశాలు ప్రయత్నిస్తున్నా చాలా చోట్ల రిజెక్ట్ అనే మాట ఎక్కువగా వినిపించడం తో ఆ సమయంలో ఓ తమిళ సినిమా చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు ఆమెకు.
 ఇక సినిమా పరిశ్రమలో మంచి బిజీగా ఉన్న సమయంలోనే ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెకు కొడుకు కూతురు ఉన్నారు. తన భర్త  బిజినెస్ చేస్తున్నాడు అని చెప్పిన అమని మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: