ఇన్నేళ్ల కెరియర్ లో తమన్నా తన క్రేజ్ ఏమాత్రం కోల్పోకుండా జాగ్రత్త పడుతూ వస్తుంది. ఇప్పటికి అమ్మడి డిమాండ్ అలానే ఉందంటే ఆమె టాలెంట్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే సినిమా లేదంటే వెబ్ సీరీస్ అదీ కాదంటే స్పెషల్ షోస్ కు సై అనేస్తుంది తమన్నా. తనలోని ఈ ఉత్సాహమే ఆమెకు అవకాశాలు వచ్చేలా చేస్తుందని చెప్పొచ్చు. లేటెస్ట్ గా తమన్నా మాస్టర్ చెఫ్ అంటూ స్పెషల్ డిజిటల్ షోకి రెడీ అవుతుంది. ఎలాంటి పాత్ర అయినా ఎలాంటి షో అయినా చేసేలా రెడీ అవుతుంది తమన్న.
అందుకే ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే తమన్నా అందుకుంటున్న ఈ అవకాశాలను చూసి మిగతా హీరోయిన్స్ షాక్ అవుతున్నారు. ఇలా వచ్చి అలా వెళ్లే హీరోయిన్స్ ఉన్న ఈ టైం లో ఇన్నేళ్లుగా తెలుగు తెర మీద తన అందం అభినయం తో అలరిస్తున్న తమన్నా ఫార్మెట్ ఏదైనా అదరగొట్టడం ఖాయమని తెలుస్తుంది. ప్రస్తుతం ఎఫ్3, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో నటిస్తుంది తమన్నా ఈ రెండు సినిమాలు భారీ అంచనాలతో వస్తున్నాయి. ఈ రెండిటిలో ఏ సినిమా హిట్టైనా సరే మళ్లీ తమన్నా మరో రెండు మూడేళ్లు కెరియర్ లో దూసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి