
టాలీవుడ్ లో రీమేక్ సినిమా చేసి సునాయాసంగా హిట్ కొట్టాలని ప్రతి హీరో అనుకుంటాడు. ఆ విధంగా ఎంతో మంది టాలీవుడ్ హీరోలు ఎలాంటి రిస్క్ లేకుండా ఇతర భాషలలో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసి ఇక్కడ విజయాన్ని అందుకున్నారు. అంతే కాదు అక్కడ ఫ్లాపైన సినిమాలను కూడా ఇక్కడ రీమేక్ చేసి హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ విధంగా టాలీవుడ్ లో రీమేక్ పై ఎక్కువ మోజు చూపిస్తూ సినిమాలను చేస్తూ ఉంటారు మన హీరోలు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం రీమేక్ సినిమా అంటేనే ఆమడ దూరం ఉంటున్నాడు.
ఆయన హీరోగా నటించిన తొలి సినిమా రాజకుమారుడు దగ్గర్నుంచి ప్రస్తుతం చేస్తున్న సర్కార్ వారి పాట సినిమా వరకు అన్ని స్ట్రైట్ తెలుగు సినిమాలే. వీటిలో ఏది కూడా ఇతర భాష లో చేసిన సినిమా గానీ ఇతర భాషల నుంచి తీసుకున్న పాయింట్ గాని లేదు. అయితే మహేష్ బాబు నటించిన సినిమాలు ఇతర భాషలలో రీమేక్ కాగా అవి అక్కడ సూపర్ హిట్ అయ్యాయి కానీ తాను మాత్రం రీమేక్ కంటెంట్ కాకుండా ఒరిజినల్ కంటెంట్ ని నమ్ముకుని సినిమాలు చేస్తున్నాడు.
అందుకే కాబోలు ఆయనకు టాలీవుడ్ లో ఎక్కువ సక్సెస్ ఉంది. టాలీవుడ్ లో ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన సినిమాలు ఎక్కువగా ఈయన పేరు మీదనే ఉన్నాయి. ఇటీవలే వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా తన విజయం సాధించగా ఇప్పుడు ఆయన పరుశురాం దర్శకత్వంలో చేయబోతున్న సర్కారు వారి పాట సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు అభిమానులు. తండ్రి అంటే ఎంతో ఇష్టం ఉన్న మహేష్ బాబు ఆఖరికి తన తండ్రి సినిమాలను కూడా రీమేక్ చేయడానికి ఒప్పుకోలేదు. తన తండ్రి నటించిన సినిమాలు క్లాసికల్ సినిమాలు అని వాటిని రీమేక్ చేసి నటించి చెడగొట్టడం తనకు ఇష్టం లేదని మహేష్ బాబు అభిప్రాయమట.