
బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ ను బాలీవుడ్ లో చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు లో ఇంత వరకు హిట్ అందుకోని హీరో బాలీవుడ్ కి వెళ్లడం ఏంటి అని మొదట్లో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేసినా చత్రపతి సినిమా రీమేక్ చేస్తున్నాడని తెలిసి బెల్లంకొండ శ్రీనివాస్ మంచి పని చేస్తున్నాడు అని సమర్థించారు. వివి వినాయక్ దర్శకత్వంలో బాలీవుడ్ లో తెరకెక్కబోయే ఈ సినిమా నేడు లాంఛనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి చత్రపతి సినిమా ఒరిజినల్ వెర్షన్ కు దర్శకత్వం వహించిన రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
నిర్మాత కొడుకు గా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మంచి మంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. పెద్ద పెద్ద హీరోయిన్లతో మాత్రమే నటించే బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవలే అల్లుడు అదుర్స్ పెద్ద ఫ్లాప్ ను అందుకుని ప్రేక్షకులను ఏమాత్రం మేప్పించలేకపోయాడు. దాంతో ఆయన మంచి హిట్ కోసం ఎదురుచూస్తుండగా చత్రపతి రీమేక్ చేసే అవకాశం వచ్చింది. నిజానికి బెల్లంకొండ శ్రీనివాస్ కి టాలీవుడ్ లో భారీ హిట్ మాత్రం దక్కలేదనే చెప్పాలి. రాక్షసుడు సినిమా కొంతవరకు హిట్ అయినా అది రీమేక్ సినిమా కావడంతో ఆ హిట్టు బెల్లంకొండ ఖాతాలోకి రాలేదు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో చేస్తున్న ఈ సినిమా హిట్టు కావాలని బెల్లంకొండ అభిమానులు ఎంతగానో ఆశిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న వినాయక్ టాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ను పరిచయం చేసింది కూడా ఈయనే కావడం గమనార్హం. మరి బాలీవుడ్ లో ఎంట్రీ చేస్తున్న వినాయక బెల్లంకొండ శ్రీనివాసులు ఏ రేంజ్లో చూపిస్తాడో. తాజాగా జరిగిన పూజా కార్యక్రమంలో ప్రభాస్ కనిపించిన చత్రపతి లుక్ లో ఉన్న బెల్లం కొండ శ్రీనివాస్ అదరగొట్టాడు. టాలీవుడ్ లో అయితే ఈ లుక్ లో బెల్లంకొండ శ్రీనివాస్ సరిగ్గా సరిపోయాడు అని కామెంట్లు పెడుతున్నారు. బాలీవుడ్ జనాలు కూడా ఫిదా అయిపోతున్నారు. మరి బెల్లం కొండ బాలీవుడ్ లో చేస్తున్న ఈ చత్రపతి ఆయన బ్లాక్ బస్టర్ హిట్ కోరిక నెరవేర్చు తుందో చూద్దాం.