ప్రస్తుతం సినిమాలన్నీ ఓటీటీ మయం అయిపోతున్నాయి.  ప్రేక్షకులు థియేటర్లు బంద్ కావడంతో ఓటీటీ లో సినిమాలు చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. పెద్ద పెద్ద సినిమాలు సైతం ఓటీటీ లలో విడుదల కావడంతో ఈ తరహాలో సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అంతేకాకుండా ఈ తరహా లో విడుదల అయ్యే సినిమాలను ప్రత్యేకంగా రూపొందించి తద్వారా లాభాలను పొందుతూ నిర్మాత ఎంతో హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తుంది. కొన్ని ఓటీటీ సంస్థలు తామే ఒరిజినల్స్ పేరుతో సినిమాలను తెరకెక్కించి విడుదల తీసుకుంటున్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ టీ టీ లో విడుదలయ్యే సినిమాల జాబితా పెద్దగానే ఉంది. వాటిలో క్రేజీ ఫిలిం వెంకటేష్ నటించిన నారప్ప సినిమా కూడా ఉంది. ఈనెల 20వ తారీఖున అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మిగిలిన సినిమాలు కూడా ఓ టీ టీ లో విడుదలయ్యేందుకు పోటీ పడుతున్నాయి. గతంలో సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్న సమయంలో నిర్మాతలు సినిమా ప్రమోషన్స్ కు కూడా సపరేట్ బడ్జెట్ పెట్టి ఈ సినిమాను ప్రేక్షకులు కు రీచ్ అయ్యేలా ప్రమోషన్స్ నిర్వహించేవారు. 

కానీ ఎప్పుడైతే డిజిటల్ రిలీజ్ లకు అలవాటు పడ్డారో సినిమా నుంచి పాటలు, టీజర్, ట్రైలర్ రావడం తప్పితే ఆడియో ఫంక్షన్ లు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లు,  ప్రెస్ మీట్ లు అనే హంగామా లేకుండా సినిమాలను విడుదల చేస్తున్నారు. నారప్ప విషయానికి వస్తే విడుదలకు నాలుగు రోజుల టైం మాత్రమే ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించట్లేదు.   ఒక నారప్ప సినిమానే కాదు డిజిటల్ గా విడుదలైన చాలా సినిమాలు ఎలాంటి హంగామా లేకుండానే విడుదల అవుతూ ఓటీ టీ కపై భారం వేస్తున్నాయి. వారు అమ్ముకున్న తర్వాత ఆయా సినిమాలు తమవి కాదన్నట్లు ప్రవర్తిస్తుండడంతో వారు ఎందుకు దీన్ని ఇంత లైట్ గా తీసుకుంటున్నారు అనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

OTT