మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. తన మొదటి చిత్రం విజేతతో మంచి నటుడిగా కళ్యాణ్ దేవ్ పేరు సంపాదించుకున్నాడు. అయితే ఈ సినిమా వచ్చి ఇప్పటికి మూడేళ్లు అవుతున్నా కూడా మరో ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాడు. అలాగే మధ్యలో ఎన్నెన్నో మలుపులు తిరిగాయి.ఇక ప్రాజెక్ట్‌లు చేతులు మారడం జరిగింది. అలాగే కథ, కథనాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇక అలా మొత్తానికి రెండు, మూడో ప్రాజెక్ట్‌లు ఓ కొలిక్కి రావడం జరిగింది.ఇక ఇప్పుడు కళ్యాణ్ దేవ్ తన నాలువగా ప్రాజెక్ట్ పనుల్లో బాగా బిజీగా ఉన్నాడు.ఇక ఇప్పటికే సూపర్ మచ్చి సినిమా పనులు దాదాపుగా పూర్తి కావొచ్చింది.ఇక ఆ తరువాత కిన్నెర సాని అనే మరో సినిమాను ప్రారంభించేశాడు. 

కరోనా మహమ్మారి లాక్డౌన్ వంటి వాటి వలన షూటింగ్‌లు అనేవి ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చాయి. ఇక అలా మొత్తానికి కళ్యాణ్ దేవ్ సెకండ్ ఇంకా థర్డ్ ప్రాజెక్ట్‌లు అనేవి ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చాయి. ఇక ఇప్పుడు నాలుగవ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టేశాడు కళ్యాణ్ దేవ్. ఇక పీపుల్ మీడియా ఫాక్టర్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్షంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి.ఇక ఇందులో కళ్యాణ్ దేవ్‌కు జోడిగా అవికా గోర్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ కాశ్మీర్ లోయలో బాగా ఎంజాయ్ చేస్తోంది.అలాగే సినిమా హీరో హీరోయిన్ల మీద రొమాంటిక్ సీన్లను యూనిట్ చిత్రీకరిస్తోన్నట్టు తెలుస్తోంది.మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ అక్కడి అందాలను తన కెమెరాలో బంధిస్తోన్నట్టు కనిపిస్తోంది. అక్కడి షూటింగ్ ఇంకా వాతావరణాన్ని కళ్యాణ్ దేవ్ బాగానే ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది.ఇక ఈ సినిమాను శ్రీధర్ సీపాన తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమా పై కళ్యాణ్ దేవ్ గట్టి ఆశలే పెట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: