టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్య దేవ్ నటించిన విభిన్న కథా చిత్రం "తిమ్మరుసు". ఈ చిత్రం నిన్న అంటే జూలై 30న థియేటర్‌లలోకి వచ్చింది. మొదటి రోజునే సినీ ప్రేమికులు, విమర్శకుల నుండి సానుకూల స్పందన రాబట్టుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం "తిమ్మరుసు" పైరసీ బాధితుడిగా మారాడు. ఈ మూవీ విడుదల రోజునే ఆన్‌లైన్‌లో లీక్ చేయబడిందని సమాచారం. ఇంటర్నెట్‌లో ఈ సినిమా ఉచిత డౌన్‌లోడ్ అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌ పైరసీ సైట్‌లైన తమిళ్‌రాకర్స్, మోవిరుల్జ్, టెలిగ్రామ్‌లో ఈ చిత్రం లీక్ చేయబడింది. అంతేకాదు క్లారిటీ కూడా హెచ్ డిలో ఉండడం గమనార్హం. ఖచ్చితంగా "తిమ్మరుసు" బాక్సాఫీస్ కలెక్షన్లను పైరసీ దెబ్బతీస్తుంది. గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో పైరసీ భూతం పెద్దది అవుతోంది. రానురానూ పైరసీ రాయుళ్ల ఆటలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇంతకుముందు కొన్ని సినిమాలైనా పైరసీ నుంచి తప్పించుకునేవి. కానీ ఇటీవల కాలంలో విడుదలైన పెద్ద, చిన్న అనే తేడా లేకుండా దాదాపు అన్ని సినెమాలూ ఆన్లైన్ లో దర్శనం ఇచ్చాయి. ఇక రానున్న రోజుల్లో అంటే సంక్రాంతికి భారీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తలపడనున్నాయి. ఆ జాబితాలో మహేష్ బాబు "సర్కారు వారి పాట", ప్రభాస్ "రాధేశ్యామ్", పవన్, రానా "అయ్యప్పనుమ్ కోషియం" రీమేక్, వెంకటేష్, వరుణ్ తేజ్ ల "ఎఫ్3"... ఇలా దాదాపు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద తలకాయలందరి సినిమాలూ సంక్రాంతి బరిలో నిలిచాయి. మరి వాటి సంగతి ఏంటో...!

ఇక "తిమ్మరుసు" విషయానికొస్తే... శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన "తిమ్మరుసు"లో సత్య దేవ్ న్యాయవాది పాత్రలో మెప్పించాడు. ఈ థ్రిల్లర్ డ్రామాలో ప్రియాంక జవాల్కర్, అజయ్, అంకిత్ కొయ్య, బ్రహ్మాజీ, ఆదర్శ్ బాలకృష్ణ, హర్ష చెముడు, ప్రవీణ్, సంధ్య జనక్, రవిబాబుతో పాటు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. దీనిని మహేష్ ఎస్. కోనేరు, యరబోలు సృజన్ సంయుక్తంగా నిర్మించారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీని అప్పు ప్రభాకర్ నిర్వహిస్తున్నారు. మరోవైపు సత్య దేవ్ తన నెక్స్ట్ సినిమాలతో బిజీగా ఉన్నారు, ఇందులో "గుర్తుందా శీతాకాలం", "గాడ్సే", "స్కైలాబ్‌" చిత్రాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: